Sunday, January 19, 2025

శుక్రవారం రాశి ఫలాలు(20-12-2024)

- Advertisement -
- Advertisement -

మేషం- పనులలో కొంత నిదానం ఉంటుంది. సన్నిహితులతో మాట పట్టింపులు అభిప్రాయ భేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. వ్యాపార రంగంలోని వారికి అనుకూలంగా ఉంది.సెల్ఫ్ డ్రైవింగ్ లో జాగ్రత్తలు అవసరం

వృషభం-  ప్రజా సంబంధ వృత్తులలో ఉన్న వారికి విశేష ఆదరణ లభిస్తుంది. అనుకొని అవకాశాలు కలిసి వస్తాయి. వృత్తి-ఉద్యోగాలపరంగా అభివృద్ధి సాధిస్తారు. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

మిథునం- వృత్తి ఉద్యోగాల పరంగా నూతన అవకాశాలు కలిసి వస్తాయి. ఆర్థిక భారం తేలికవుతుంది. బరువు బాధ్యతలు శుభకార్యాలు పూర్తి చేయడానికి అధిక ధనాన్ని వెచ్చిస్తారు.

కర్కాటకం – ప్రధానమైన కార్యక్రమాలను నిర్వహించడానికి కావలసిన ధనమును  వ్యయ ప్రయాలకోర్చి సమకూర్చుకోగలుగుతారు. ఎంతో శ్రమించి ప్రత్యేక శ్రద్ధ వహించినప్పటికీ వృత్తి వ్యాపారాలలో సాధారణ ఫలితాలు లభిస్తాయి.

సింహం – వృత్తి ఉద్యోగాలలో కొన్ని అనుకోని మార్పులు వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అవసరాలకు ధనం చేతికి అందుతుంది. ఖర్చులు కొంత అధికమవుతాయి.

కన్య- మీ మానసిక ఆనందం మెరుగుపడుతుంది. సంతోషకరమైన శుభవార్తలు వినగలుగుతారు. పిల్లలతో పెద్దలతో కలిసి ఆనందంగా సమయం గడుపుతారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది.

తుల:  అనుకున్న విధంగా అవసరాలకు డబ్బు చేతికంది వస్తుంది. నూతన వస్త్రాలను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. పూజా కార్యక్రమాలలో పాల్గొంటారు. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది.

వృశ్చికం: సన్నిహితులతో స్నేహితులతో కాలాన్ని ఆనందకరంగా గడుపుతారు. విందు, వినోదాలలో పాల్గొంటారు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. సెల్ఫ్ డ్రైవింగ్ పట్ల ఖచ్చితమైన జాగ్రత్తలు అవసరం.

ధనస్సు: శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. కేసుల నుండి బయట పడతారు. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి.

మకరం: ఇతరుల అతి జోక్యం వలన కుటుంబ కలహాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. జాగ్రత్తలు పాటించండి అధిక శ్రమను పంచుకోవడానికి నమ్మకస్తులైన వారికి కొన్ని బాధ్యతలను అప్పగిస్తారు.

కుంభం: ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. విలువైన వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. కాంట్రాక్టులు లాభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.

మీనం: భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. వ్యాపారంలో రొటేషన్లు బాగుంటాయి. క్రయవిక్రయాలకు సంబంధించి అంశాలు సానుకూల పడతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News