Tuesday, January 21, 2025

మంగళ వారం రాశి ఫలాలు(21-01-2025)

- Advertisement -
- Advertisement -

మేషం – మీ ప్రయోజనాలు పదిలంగా ఉంటాయి. ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగ్గా ఉంటాయి. గోప్యంగా కొన్ని పనులు చేపట్టి వాటిని అభివృద్ధి పథంలో నడిపించడానికి  సమాయత్తమవుతారు.

వృషభం –  ఆర్థికంగా బాగుంటుంది. కొన్ని విషయాలలో నిక్కచ్చిగా వ్యవహరిస్తారు. ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. వృత్తి పరంగా కనబరిచే ఓర్పు మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది.

మిథునం – క్షణం తీరిక లేకుండా హడావుడిగా కాలాన్ని గడుపుతారు. అందుకు తగిన ప్రతిఫలం మాత్రం పూర్తిస్థాయిలో లభించదు. కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన అంశాలు లాభిస్తాయి.

కర్కాటకం – నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి కావలసిన వనరుల సమీకరణకు ఎక్కువగా ప్రాముఖ్యతను ఇస్తారు. ముఖ్యమైన అన్ని విషయాల పట్ల జాగ్రత్తతో వెలగడం చెప్పదగినది.

సింహం – చికాకు అసహనం అధికంగా ఉంటాయి. కీలకమైన సంతకాలు, విలువైన పత్రాల భద్రత విషయాలలో జాగ్రత్తలు వహించండి. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయరాదు.

కన్య – ఆర్థిక స్థితి పైన శ్రద్ధ ఎక్కువగా చూపించవలసి ఉంటుంది. తేలికగా సులువుగా పూర్తి అవుతాయి అనుకున్న పనులు ఎంతో కష్టపడితే గాని పూర్తవవు. కొత్త వ్యక్తులను కలుసుకుంటారు.

తుల – కొత్త వ్యక్తులను కలుసుకుంటారు. నూతన విషయాలు తెలుసుకుంటారు. కుటుంభంతో కలిసి ఆనందంగా సమయం గడుపుతారు. ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది.

వృశ్చికం –  ఆర్థిక అభివృద్ధి కొరకు కష్టపడాల్సిన తరుణం. మొండి బాకీలు వసూలు అవుతాయి. పరపతిని పెంచుకోవడానికి చేసే యత్నాలు అనుకూలిస్తాయి. సానుకూల ఫలితాలు సాధించగలుగుతారు.

ధనుస్సు – వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.

మకరం –  ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. ఆరోగ్య విషయంలో మెలకువ అవసరం. మానసిక ఆనందం కలిగి ఉంటారు.

కుంభం –  ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. కాంట్రాక్టులు దక్కుతాయి. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. రుణాలు చాలా వరకు తీరుస్తారు.ఇకపై రుణాలు చేయకూడదని నిర్ణయం తీసుకుంటారు.

మీనం – ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు చేతికి అందుతుంది. వృత్తి,వ్యాపారాలలో ఆటంకాలు ఎదురై చికాకులు పెడతాయి. కోర్టు వ్యవహారాలు. వివాదాస్పద అంశాలు అనుకూలిస్తాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News