మేషం – ఆరోగ్యం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. లక్ష్యసాధన ధ్యేయంగా అడుగులు ముందుకు వేస్తారు. మీ ప్రణాళికలు వ్యూహాలు చాలా వరకు ఫలిస్తాయి మానసిక సంఘర్షణ మాత్రం తీరదు.
వృషభం -స్వయంకృతాపరాదాలు చోటు చేసుకుంటాయి. న్యాయవాదులతోటి చర్చలు సాగిస్తారు. వృత్తి ఉద్యోగాలపరంగా చేసే చిన్నపాటి ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.
మిథునం -వ్యాపార కేంద్రంలో అనుకూల ఫలితాలను సాధించగలుగుతారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉండడం వలన ఎన్ని ఒత్తిడిలు ఎదురైనప్పటికీ ధైర్యంగా ముందడుగు వేయగలుగుతారు.
కర్కాటకం -వ్యాపారంలో భాగస్వాముల నిజాయితీ మీద అపనమ్మకం ఏర్పడుతుంది.ఆరోగ్యానికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తారు. బాధ్యతల నిర్వహణ వెనుకడుగు వేయరు.ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం తగదు.
సింహం -అనుకూలమైన ఆనందకరమైన సమాచారాన్ని అందుకోగలుగుతారు. మీరు అడిగే సెలవులు కార్యాలయంలో మంజూరు కాకపోవడంతో కొంత అసంతృప్తి ఏర్పడుతుంది.
కన్య – పొదుపు పథకాలను ఆశించిన స్థాయిలో కాకపోయినా కొంతవరకు పాటించగలుగుతారు. అనుకున్న పనులు కష్టం మీద సానుకూల పడతాయి. ప్రతిపని నిదానంగా నింపాదిగా ముందుకు సాగుతుంది.
తుల -పెట్టుబడులు ప్రధాన ప్రస్తావనాంశాలవుతాయి.అనుకోని వ్యక్తులు తారసపడతారు.క్రయక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు. సంతాన విషయమై ప్రత్యేక శ్రద్ధ కనబరచవలసి వస్తుంది.
వృశ్చికం -సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు అవసరం. దూరప్రాంత విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ప్రభుత్వ పరంగా ఆహ్వానాలు అందుతాయి.
ధనుస్సు -మీకు లభించవలసిన సౌకర్యాలను సాధించుకోవడానికి గాను అమితంగా కృషిచేవలసి వస్తుంది. పరపతిని కూడా ఉపయోగించవలసి వస్తుంది. కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేస్తారు.
మకరం -దీర్ఘకాలికమైనటువంటి ఒప్పందాలను కుదుర్చుకునేటప్పుడు నిష్ణాతుల సలహాలను పరిగణలోకి తీసుకోండి. ఏకపక్షం అభిప్రాయాలు, ఏకపక్ష నిర్ణయాలు లాభించవు.
కుంభం -నిష్కారమైన నిందలు ప్రచారంలో ఉంటాయి. అయితే వీటిని మీరు ఏ మాత్రం లెక్కపెట్టరు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. అనవసరమైన వివాదాలు చోటు చేసుకుంటాయి.