మేషం – మొండి బాకీలు కొంతమేర వసూలు అవుతాయి. కార్యాలయంలో పని భారం అధికంగా ఉంటుంది. ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. అనుకోని అవకాశాలను అందిపుచ్చుకుంటారు.
వృషభం – ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంటుంది. ఆరోగ్యం, ఆహారం విషయాలలో మెలకువలు పాటించండి.
మిథునం – వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సంతానం నూతన ఉద్యోగ అవకాశాలు పొందు తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు, కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు.
కర్కాటకం – క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితుల సహాయం పొందగలుగుతారు. గృహ నిర్మాణ ఆలోచనలు నిదానంగా కార్యరూపం దాలుస్తాయి.
సింహం – చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మిత్రుల నుండి సలహాలు సూచనలు ఎక్కువగా తీసుకుంటారు. విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి.
కన్య – చేపట్టిన కార్యక్రమాలు నిదానంగా పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామి నుండి స్వల్ప ధన లాభం పొందుతారు. మానసిక ప్రశాంతతకు భంగం కలిగించే విధంగా కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి.
తుల – ప్రతి విషయాన్ని సూక్ష్మదృష్టితో పరిశీలిస్తారు. విజ్ఞాన పరమైన ఆలోచనలు చోటు చేసుకుంటాయి. నూతన వ్యక్తితో పరిచయం మిత్రత్వానికి దారితీస్తుంది. పొదుపు పథకాలకు గండి ఏర్పడుతుంది.
వృశ్చికం – స్నేహితులతో కలిసి నూతనమైన వ్యాపారాన్ని ప్రారంభించడానికి సమాలోచనలు సాగిస్తారు. అయితే ఈ ఆలోచనలు వెంటనే కార్యరూపం దాల్చేటువంటి పరిస్థితి గోచరించడం లేదు.
ధనుస్సు – ఏమాత్రం ఒత్తిడికి గురి కాకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకోగలుగుతారు. మీపై ప్రచారంలో ఉన్న అపవాదులను రూపుమాపకునే ప్రయత్నాలకు గాను శ్రీకారం చడుతారు.
మకరం – మీ ఆలోచనలు సవ్యమైన దారిలో ఉండటం వలన ఫలితాలు కూడా మెరుగ్గా ఉంటాయి. ఆత్మవిశ్వాసం మనోధైర్యం పెరుగుతాయి. సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు.
కుంభం – ప్రతి విషయాన్ని కీడేంచి మేలేంచమన్న విధంగా ఆలోచిస్తారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మీలో చురుకుదనం వేగము లేవని భావిస్తారు. వ్యాపారాలలో స్వల్ప ఒడిదుడుకులు ఎదురయ్యే సూచన.
మీనం – మెరుగైన జీవితాన్ని సాగించడానికి అభివృద్ధి మార్గాలను అన్వేషిస్తారు. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు పాటించండి. ఆకస్మిక ప్రయాణాలు కలిసి వస్తాయి.