Thursday, January 23, 2025

గురువారం రాశి ఫలాలు(23-01-2025)

- Advertisement -
- Advertisement -

మేషం – మీ ఆలోచన విధానంలో మంచి మార్పులు చేసుకుంటాయి. పరపతి పెరుగుతుంది. సంఘంలో గౌరవం పొందుతారు. సంతానమునకు విద్యావకాశాలు. ఉద్యోగులకు కొత్త హోదాలు పొందుతారు.

వృషభం –  అనుకోని ప్రయాణాలు చేస్తారు. జీవిత భాగస్వామితో స్వల్పమైన విభేదాలు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయి. పరపతి కలిగిన వారితో పరిచయాలు మరింత బలపడతాయి.

మిథునం – ఉద్యోగాలపరంగా మీ కృషి శక్తి సామర్థ్యాలు ప్రశంసలకు నోచుకుంటాయి. చేసిన పొరపాట్లు మళ్లీ చేయకుండా జాగ్రత్త వహిస్తారు.ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.

కర్కాటకం – మీ ఉన్నతిని చూసి ఓర్వలేని వారు అధికంగా ఉంటారు. చేపట్టిన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. ఆదాయ వ్యయాలు సరి సమానంగా ఉంటాయి.

సింహం – అనుకోని అవకాశాలు లభిస్తాయి వాటిని సద్వినియోగం చేసుకుంటారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. కాంట్రాక్టులు అతి కష్టం మీద దక్కుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి.

కన్య – ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఇతరుల విషయాలలో జోక్యం తగదు. ఇంట్లోశుభకార్యాల ప్రస్తావన ఉంటుంది.

తుల – వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త వల్ల ఆనందం కలుగుతుంది. కుటుంబ సమస్యల నుండి సహాయసహకారాలు అందుతాయి.

వృశ్చికం – ఆదాయం కంటే ఖర్చులు అధికంగా వుంటాయి. ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. వివాదాలకు దూరంగా వుండండి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా వుండును.

ధనుస్సు – నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. బంధువుల నుండి వచ్చిన వార్త ఆశ్చర్యపరుస్తుంది. మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమవుతాయి.

మకరం –  ముఖ్యమైన నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. సంతానం చేయు నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. భూవివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. నూతన ప్రయత్నాలు లాభిస్తాయి.

కుంభం –  ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు. సోదరుల నుండి ధన, వస్తు లాభాలు పొందుతారు. మిత్రులతో కలిసి ప్రయాణాలు చేస్తారు.

మీనం – చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. గృహనిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. కొత్త మిత్రులు పరిచయమై సాయం అందిస్తారు. సంతానం నుండి కీలక సమాచారం అందుకొంటారు. అరుదైన ఆహ్వానాలు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News