మేషం – వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. కుటుంబంలో ఎదురైన చికాకులు తొలుగుతాయి.
వృషభం – ఆర్థిక పరిస్థితి అనుకూలంగా వుంటుంది. రుణాలు తీరి ఊరట చెందుతారు. ప్రయాణాలలో తొందరపాటు వద్దు. క్రయవిక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు.
మిథునం – కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు. పాత బాకీలు వసూలు అవుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.
కర్కాటకం – ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. నూతన ప్రయత్నాలలో పురోగతి.ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. పారిశ్రామిక రంగాలలోని వారికి బాగుంటుంది.
సింహం – ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కాంట్రాక్టులు దక్కుతాయి. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండటం అన్ని విధాల మంచిది. సంతానం నుండి ధన లాభం పొందుతారు.
కన్య – ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పనులలో తొందరపాటు వద్దు. రుణ బాధల నుండి విముక్తులవుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు, సంఘంలో గౌరవం పొందుతారు.
తుల- వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖుల నుండి కీలక సమాచారం అందుకుంటారు.
వృశ్చికం – మీ ప్రతిభకు తగిన గుర్తింపు పొందుతారు.ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది. ఇతరుల విషయాలలో జోక్యం తగదు. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. కాంట్రాక్టులు దక్కుతాయి.
ధనుస్సు – వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. దీర్ఘకాలిక రుణాలు ఎదురయి చికాకులు పెడతాయి. ఎంత కష్టపడినా ఫలితం దక్కదు. ముఖ్యమైన వ్యవహారాలలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు.
మకరం – పనులు నిదానంగా సాగుతాయి. నూతన ప్రయత్నాలలో తొందరపాటు నిర్ణయాలు వద్దు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంటుంది. భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.
కుంభం – ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలు లభిస్తాయి. వాటిని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి. ప్రయాణాలలో తొందరపాటు నిర్ణయాలు వద్దు.
మీనం – ఎంతటి కార్యాన్నైనా పట్టుదలతో సాధిస్తారు. వృత్తి- వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. మీ శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. మీలోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది.