Thursday, January 23, 2025

వార ఫలాలు(24-11-2024 నుండి 30-11-2024 ) వరకు

- Advertisement -
- Advertisement -

మేషం:   మేష రాశి వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మీ ఆలోచన శక్తితో ముందుకు వెళతారు. ఉద్యోగంలో మార్పులు చోటు చేసుకుంటాయి. నూతన వ్యాపార వ్యవహార విషయాలలో కొంత ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సంతానం యొక్క చదువు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సంతానాన్ని విదేశాలకు పంపించాలని ప్రయత్నాలు చేస్తారు. సహోదర సోదరీమణులతో చిన్నపాటి విభేదాలు కనిపిస్తున్నాయి .విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఈ వారం ఉద్యోగం లభిస్తుంది. వివాహాది శుభకార్యాలలో ఒక అడుగు ముందుకు వేస్తారు మంచి సంబంధం కుదురుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య నాలుగు కలిసివచ్చే దిక్కు తూర్పు కలిసి వచ్చే రంగు బ్లూ. ఆరావళి కుంకుమతో అమ్మవారిని పూజించండి. అలాగే మేధో దక్షిణామూర్తి రూపును మెడలో ధరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి..

వృషభం:  వృషభ రాశి వారికి ఈ వారం మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇటు ఉద్యోగం లో కానీ వ్యాపారంలో కానీ లాభసాటి గానే ఉంటుంది. ప్రమోషన్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగంలో నూతన మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా కళా రంగంలోని వారికి సినిమా రంగంలోని వారికి బాగుంది. భూమి గానీ గృహం కానీ కొనుగోలు చేస్తారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉద్యోగ పరంగా వ్యాపరపారంగా బాగుందని చెప్పవచ్చు. అయితే భాగస్వామ్య వ్యాపారాలలో చిన్నపాటి ఇబ్బందులు ఉండే అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్స్ కానీ వచ్చే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. వైద్య విద్య వారికి సాఫ్ట్వేర్ రంగంలోని వారికి ఎంబీఏ ఫైనాన్స్ వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. మేధా దక్షిణామూర్తి స్తోత్రం మరియు కాలభైరవాష్టకం పఠించండి. కాలభైరవ రూపు మేధా దక్షిణామూర్తి రూపు మెడలో ధరించండి.

 మిథునం: మిధున రాశి వారికి ఈ వారం మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఉంటుంది అయితే ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా హార్డ్ కి సంబంధించి కిడ్నీకి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. జంక్ ఫుడ్స్ కి దూరంగా ఉండండి.. వ్యాపారస్తులకు వ్యాపార పరంగా బాగుందని చెప్పవచ్చు. నూతన బ్రాంచీలను ప్రారంభిస్తారు. రియల్ ఎస్టేట్ బంగారు వ్యాపారస్తులకు వస్త్ర వ్యాపారస్తులకు అలాగే ఈవారం బాగుందని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా బాగుంది. మీ కష్టానికి తగిన ఫలితం అనేది తక్కువగా ఉంటుంది. స్టాక్ మార్కెట్ కి దూరంగా ఉండటం అనేది చెప్పదగిన సూచన. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థినీ విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఏ పని చేసినా కలిసి వస్తుంది మానసిక ధైర్యాన్ని కలిగి ఉండండి.  ఈ రాశి వారు ప్రతి రోజు జిల్లేడు వత్తులతో దీపారాధన చేయండి. ఓం నమో శివాయ వత్తులతో సాయంత్రం పూట కార్తీక దీపం వెలిగించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. శక్తి కంకణం చేతికి ధరించండి..

కర్కాటకం :  కర్కాటక రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగాలలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారంలో చిన్నచిన్న ఇబ్బందులు ఏర్పడినప్పటికీ అవి పెద్దగా ఇబ్బంది పెట్టవు. జువెలరీ వ్యాపారస్తులకు ఈవారం బాగుందని చెప్పవచ్చు. ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. ఆరోగ్యం విషయంలో చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి. మోకాళ్ళ నొప్పులు కీళ్ల నొప్పులు గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి జంక్ ఫుడ్ కి దూరంగా ఉండటం సమయానికి ఆహారం తీసుకోవడం చెప్పదగిన సూచన. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి భూమి అమ్మాలన్నా కొనాలన్నా ఇబ్బందికరంగా మారుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి బాగుందని చెప్పవచ్చు విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంత జాప్యం జరుగుతుంది. ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించండి. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమ : శివాయ వత్తులతో దీపారాధన చేయండి. కాలభైరవాష్టకం ప్రతిరోజు చదువుకోండి. కాలభైరవ రూపు మెడలో ధరించండి.

సింహరాశి : సింహ రాశి వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి ఉద్యోగాలలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి వ్యాపారంలో పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. మీకున్న తెలివితేటలకు నలుగురిలో మంచి గుర్తింపు లభిస్తుంది. కానీ ఇంట్లో మాత్రం ఎటువంటి గుర్తింపు ఉండదు. జీవిత భాగస్వామితో స్వల్ప విభేదాలు ఉంటాయి జాగ్రత్త వహించండి. భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు వెళ్లడం అనేది చెప్పదగిన సూచన. జీవిత భాగస్వామితో గొడవల వల్ల ఆ ప్రభావం అనేది పిల్లల మీద పడుతుంది. వారిని దృష్టిలో ఉంచుకొని కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం ఉండేటట్టు చూసుకోండి.నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగం కొంత ఆలస్యంగా వస్తుంది. మీకున్న తెలివితేటలు అపారం కాబట్టి వాటిని సద్వినియోగపరచుకోండి.  తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా బాగుందని చెప్పవచ్చు. వ్యాపారం కలిసి వస్తుంది. ప్రస్తుత పరిస్థితుల రీత్యా ఉన్న ఉద్యోగం మారకపోవడం అనేది చాలా మంచిది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య 9. కలిసివచ్చే దిక్కు తూర్పు కలిసి వచ్చే రంగు తెలుపు.

కన్య:    కన్యా రాశి వారికి ఈ వారం చాలా బాగుంది. ఉద్యోగంలో సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. బంధువులలో మిత్రులలో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. మీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి ఎంతో ప్రయత్నం చేస్తారు అది ఈ వారం నెరవేరుతుంది.ఆధ్యాత్మిక ప్రదేశాలను ఎక్కువగా సందర్శిస్తారు.సాఫ్ట్వేర్ రంగంలోని వారికి ఫైనాన్షియల్ సెక్టర్ లో ఉన్న వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం  నమ : శివాయ వత్తులతో దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విద్యార్థిని విద్యార్థులకు ఈవారం బాగుందని చెప్పవచ్చు. ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా అన్ని విధాలుగా బాగుంది. విదేశాలలో ఉన్న వారికి కూడా ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి.బ్యాంకు రుణాలు మంజూరు అవుతాయి. మీకు మీరుగా నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగండి మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య 3, కలిసివచ్చే దిక్కు ఉత్తరం, కలిసి వచ్చే రంగు తెలుపు. అలాగే మేధో దక్షిణామూర్తి రూపును మెడలో ధరించండి.

తుల : తులా రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు అయితే మీ కష్టానికి తగిన ప్రతిఫలం మాత్రం దక్కకపోవచ్చు. కష్టం మనది ఫలితం వేరొకరిది అన్నట్టుగా ఉంటుంది ఈవారం. వ్యాపార పరంగా కూడా ఇదే విధంగా ఉంటుంది. మీకు మీరుగా స్వతంత్రించి ఏ నిర్ణయం తీసుకున్న ఏ పని చేసినా కలిసి వస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలు గాని భాగస్వాములు చేసే పనులు కూడా విజయవంతమైన ఫలితాలను ఇవ్వవు. కాబట్టి ఏదైనా సరే మీకు మీరుగా మీ సొంత ఆలోచనతో చేసుకోవడం అనేది ఉత్తమం.బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అవసరమవుతాయి. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. వీసా పాస్పోర్ట్ వంటి అంశాలు సానుకూలపడతాయి. ప్రతి మంగళవారం శనివారం రోజున హనుమాన్ వత్తులతో దీపారాధన చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కాలభైరవ రూపును మెడలో ధరించడం వలన నరదిష్టి అనేది తొలగిపోతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసివచ్చేదిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ.

వృశ్చికం:  వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చినప్పటికీ అవి తొలగిపోతాయి. మీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి ఎంతో శ్రమిస్తారు. బంధువులతో మాట పట్టింపులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి .ఉద్యోగస్తులకు ఉద్యోగ పరంగా ఈ వారం బాగుంటుందని చెప్పవచ్చు కొత్త ప్రాజెక్టులు కలిసి వస్తాయి వ్యాపార రంగంలో ఉన్న వారికి కూడా వ్యాపార పరంగా చెప్పుకోదగిన లాభాలు ఉంటాయి కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు మాత్రం అంతా అనుకూలంగా లేదు .నష్టం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి.నలుగురితో పాటు మనం మనతో పాటు నలుగురు అనే విధంగా నడుచుకుంటారు. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమ : శివాయ వత్తులతో దీపారాధన చేయండి. రాహుకాల సమయంలో నవగ్రహాలకు దీపారాధన చేసినట్లయితే సమస్యల నుండి కొంతవరకు ఉపశమనం లభిస్తుంది. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు.

ధనస్సు:    ధనస్సు రాశి వారికి ఈవారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి . సోదరులతో విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, ముఖ్యంగా ఆస్తికి సంబంధించిన ఉద్యోగపరంగా బాగుంటుంది వ్యాపారంగూడా బావుంది. ముఖ్యంగా సంతానం విషయంలో కూడా మీరు కోరుకున్న అభివృద్ధి కనిపిస్తుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం త్వరగా లభిస్తుంది. సాధ్యమైనంత వరకు శివారాధన ఎక్కువగా చేయండి దాని ద్వారా చాలా సమస్యలు తొలగిపోయి ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. సూర్యోదయానికి ముందు సూర్యోదయం తర్వాత కార్తీకదీపం వెలిగించండి, సోమవారం రోజున శివాలయంలో రుద్రాభిషేకం చేయించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఉద్యోగంలో కంటే కూడా వ్యాపారంలో ఎక్కువగా రాణిస్తారు. ఫ్యాషన్ డిజైనింగ్ బోటిక్స్ రంగాలలో ఉన్న వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఈవారం కొంత ఉపశమనం కలుగుతుంది. మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు చేసే ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం నెరవేరుతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5 కలిసివచ్చే దిక్కు తూర్పు కలిసి వచ్చే రంగు గ్రీన్.

మకరం:   మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి . ఏ పని మొదలు పెట్టినా ముందుకు సాగదు. ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు తలెత్తుతాయి. ముఖ్యంగా మోకాళ్ల నొప్పులు బ్యాక్ పెయిన్ చెవికి సంబంధించిన సమస్యలు ఇబ్బంది పెడతాయి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పదగినది. మీకు ఉన్న గుర్తింపు గుడ్ వీలు ఎల్లవేళలా మిమ్మల్ని కాపాడుతుంది. బ్యాంకు లోన్లు మంజూరు అవుతాయి. వ్యాపార పరంగా అభివృద్ధి బాగుంటుంది. భాగస్వాముల మధ్య ఏర్పడిన విభేదాలు తొలగిపోతాయి. నూతన ప్రాజెక్టులు చేపడతారు. వచ్చిన లాభాలు పెట్టిన ఖర్చులు సమానంగా ఉంటాయి. టీం స్పిరిట్ బాగుంటుంది. సంతాన విషయం ఈ వారం బాగుంటుందని చెప్పవచ్చు. మంచి సంబంధం కుదురుతుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు విద్యాపరంగా బాగుంటుంది. ఈ రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తున్న కారణంగా ఎనిమిది శనివారాలు శనికి తైలాభిషేకం చేయించి అఘోర పాశుపత హోమం చేయించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ.

కుంభం:   కుంభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అందులోనూ వెన్నునొప్పి విషయంలో జాగ్రత్తలు అవసరం అవుతాయి. ఉద్యోగంలో ఎటువంటి మార్పులు వచ్చినా సరే ధైర్యంగా నిలబడి ముందుకు సాగండి. ఉద్యోగస్తులకు ఉద్యోగ పరంగా వ్యాపారస్తులకు వ్యాపార పరంగా అంతగా బాలేదని చెప్పవచ్చు. రొటేషన్ బాగున్నప్పటికీ అనుకున్నంత ధనం చేతికి రాదు. ముఖ్యంగా పొదుపు విషయంలో జాగ్రత్తలు అవసరం అవుతుంది. నిరుద్యోగులైన విద్యావంతులకు ఈ వారాంతంలో ఉద్యోగం లభిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్యా 3, కలిసి వచ్చే దిక్కు తూర్పు కలిసి వచ్చే రంగు తెలుపు.

­ మీనం:  మీన రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. నలుగురిలో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాల పరంగా మీకంటూ ఒక స్థాయి స్థానం సంపాదించుకుంటారు. వ్యాపారంలో రొటేషన్స్ బాగున్నాయి. వ్యాపారంలో ప్రతి చిన్న విషయాన్ని మీరే దగ్గరుండి క్షుణ్ణంగా పరిశీలించుకున్నట్లయితేనే లాభాలు బాగుంటాయి లేని ఎడల నష్టాలు వచ్చే ప్రమాదం ఉంది. గురు గ్రహ స్తోత్రం, శుక్ర గ్రహ స్తోత్రం, శని స్తోత్రం ఈ మూడు మీకు ఎంతవరకు వీలైతే అంతవరకు చదవండి చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తున్న కారణంగా ప్రతి పనిలో కూడా కష్టేఫలి అన్నట్టుగా ఉంటుంది. ఈ రాశి వారు శివారాధన ఎంత ఎక్కువ చేస్తే అంత బాగుంటుంది ప్రతి శనివారం నలుపు వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య రెండు,కలిసి వచ్చే దిక్కు ఉత్తరం, కలిసి వచ్చే రంగు తెలుపు.

Saturday rasi phalalu

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News