Monday, January 20, 2025

ఆదివారం రాశి ఫలాలు(25-02-2024)

- Advertisement -
- Advertisement -

మేషం – ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా వుంటుంది. రుణ వత్తిడుల నుండి బయటపడతారు. సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మిత్రుల నుండి కీలక సమాచారం అందుతుంది.

వృషభం – అనుకోని సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. వివాదాలకు దూరంగా వుండండి. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకొంటారు. ఆరోగ్యం పట్ల మెలకువఅవసరం.

మిథునం – ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సోదరుల నుండి శుభవార్తలు అందుకొంటారు. ఆకస్మిక ధనలాభం. సంతానంనకు నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా వుండము. నూతన వస్తు కొనుగోలు.

కర్కాటకం –వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆస్తి వివాదాలు తీరి ఊరట చెందుతారు. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. కొత్త వస్తువులు, ఆభరణాలు కొనుగోలు.

సింహం –అనుకోని అవకాశాలు లాభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకొంటారు. పనులలో ఆటంకాలు ఎదురైన అధిగమిస్తారు. దూరపు బంధువుల నుండి కీలక సమాచారఅందును.

కన్య –బంధువులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకొంటారు. దీర్ఘకాలిక సమస్యలు ఎదురై చికాకులు పెట్టిన సన్నిహితుల సాయంతో తీరుతాయి. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి.

తుల –భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. విలువైన వస్తువులు,ఆభరణాలు కొనుగోలు చేస్తారు.సంతానంనకు సాంకేతిక విద్యావకాశాలు     లాభిస్తాయి.

వృశ్చికం –సంఘంలో గౌరవం పొందుతారు. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. దూర ప్రాంతాల నుండి విలువైన సమాచారం అందుతుంది. క్రయ, విక్రయాలలో లాభాలు పొందుతారు.

ధనుస్సు –వృత్తి, వ్యాపారాలలో లాభాలు పొందుతారు. వివాదాలకు దూరంగా వుండండి. జీవిత భాగస్వామితో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకొంటారు.ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం.

మకరం – ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. రుణ వత్తిడులు కొంత వరకు తీరుతాయి. అనుకోని అవకాశాలు ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకొంటారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఆరోగ్యం పట్ల మెలుకువ అవసరం.

కుంభం –నూతన మిత్రులు పరిచయమై కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త వల్ల ఆనందం కలుగుతుంది. విందు, వినోదాలు. శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. వస్తు, వస్త్రాలు కొనుగోలు.

మీనం –దూర ప్రాంత ప్రయాణాలు లాభిస్తాయి. ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. సన్నిహితుల నుండి సహాయసహకారాలు అందుతాయి. పరిస్థితి కొంత వరకు అనుకూలంగా వుండును. వస్తు, వస్త్రాలు కొనుగోలు.

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News