Wednesday, March 26, 2025

మంగళ వారం రాశి ఫలాలు(25-03-2025)

- Advertisement -
- Advertisement -

మేషం – విదేశీయాన ప్రయత్నాలు ఫలించే సూచనలు ఉన్నాయి. కొత్త బ్యాంక్ అకౌంట్లను ప్రారంభిస్తారు.  కార్యాలయంలో మీ స్థాయి పెరుగుతుంది. బరువు బాధ్యతలు కూడా అదే స్థాయిలో పెరుగుతాయి.

వృషభం -సామాజిక న్యాయములు సంఘటనలు కొన్ని కార్యక్రమంలకు ఇబ్బందిని కలిగిస్తాయి. ఎదుటి వారి మనస్తత్వాలు అర్థం చేసుకోవడం కష్టంగా పరిణమిస్తుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి.

మిథునం -ఆరోగ్యం నలతగా ఉంటుంది. వైద్యుని మార్పు చేస్తారు. కనుమరుగైన వస్తువులు తిరిగి మీకు లభించే సూచనలు ఉన్నాయి. స్త్రీ సంతానం పట్ల విశేషమైన ప్రేమాభిమానాలను కనబరుస్తారు.

కర్కాటకం -కుటుంబంలో కొన్ని శుభకార్యాలకు తలపెట్టిన శుభకార్య ప్రయత్నాలు సానుకూల పడతాయి. తాత ముత్తాతల నుండి వచ్చిన కొన్ని ఆస్తిపాస్తులను అమ్మటానికి లేదా తనఖా ఉంచడానికి మీపై ఒత్తిడి రావచ్చు.

సింహం -ఇరుగు పొరుగు వారితో స్నేహం బలపడుతుంది. రాజకీయాలలో, కార్మిక సంఘాలలో పనిచేసే వారికి సంఖ్యా బలం మునుపటికన్నా పెరుగుతుంది.దూర ప్రాంతాల నుండి శుభవార్తలువింటారు.

కన్య -వృత్తిపరంగా తలపెట్టిన కొన్ని పనులలో విజయాలను చూస్తారు.వ్యాపారపరంగా స్వల్పమైన అభివృద్ధిని సాధించగలుగుతారు. దైవానుగ్రహం వెన్నంటే రక్షిస్తున్నట్లుగా భావిస్తారు.

తుల – పనులు నిదానంగా పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగాలలో, వ్యాపారంలో మీకు సమాన స్థాయి పోటీగా కొన్ని సంఘటనలు, వ్యక్తులు ఎదురు కావచ్చు. వృధా ఖర్చులు అధికమవడం ఆందోళన కలిగిస్తుంది.

వృశ్చికం -కోర్టులో ఫలితాలు మీకు అనుకూలంగా పరిణమిస్తాయి.అన్ని విషయాలను బాగా ఆలోచించి మొదలుపెట్టడం, నిర్వర్తించడం మంచిది.డబ్బు లేదా విలువైన వస్తువుల రవాణాలో మెలకువతో ఉండాలి.

ధనుస్సు -మాతృ సంబంధిత వర్గీయుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి. పైరవీలు చేసే వారికి దూరంగా ఉండండి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంటుంది. వ్యవహారాలలో తొందరపాటు వద్దు.

మకరం -ప్రత్యర్థులు సమస్యలను సృష్టించిన.అధిగమిస్తారు బంధువులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. సన్నిహితుల నుండి ముఖ్య సమాచారం అందుకుంటారు.

కుంభం -వృత్తి వ్యాపారాలలో స్వల్ప మార్పులు ఉంటాయి. జీవిత భాగస్వామితో అభిప్రాయ బేధాలు ఏర్పడతాయి. ఆహార నియమాలు పాటించడం అన్ని విధాల శ్రేయస్కరం అని గ్రహిస్తారు.

మీనం -ఆర్థిక వ్యవహారాలను వాయిదా వేయండి.ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి.చాలా కాలంగా ఎదుర్కొంటున్నటువంటి సాంకేతిక ఇబ్బందుల నుండి బయటపడగలుగుతారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News