మేషం: మేష రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపార పరంగా బాగుందని చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో మంచి స్థానం లభిస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఖర్చులను అదుపులో పెట్టుకోవాలి. నూతన గృహం కొనుగోలు చేయాలనుకునే వారు ఈ వారం అడ్వాన్స్ ఇచ్చే సూచన కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. విహారయాత్రలు చేస్తారు. నూతన వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టడానికి కాలం అనుకూలంగా ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఈ రాశి వారు ప్రతి రోజు ప్రతినిత్యం ఓం నమశివాయ వత్తులతో దీపారాధన చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య ఆరు, కలిసి వచ్చే రంగు ఎరుపు, కలిసి వచ్చే దిక్కు తూర్పు.
వృషభం : వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. మీరు తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం గోచరిస్తుంది. రూపాయి లాభం వస్తే మూడు రూపాయల ఖర్చు అవుతుంది. కాబట్టి ఖర్చు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. హౌసింగ్ లోన్ విషయంలో క్రెడిట్ కార్డు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార పరంగా బాగానే ఉంటుంది కానీ అవసరానికి చేతికి డబ్బు అందకపోవచ్చు. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన సమయం కాదు. మీరు తలపెట్టిన ఒక ముఖ్యమైన వ్యవహారం ఈ వారం నెరవేరే సూచన కనిపిస్తుంది. ఈ రాశుల జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. ఎన్నో ఏళ్లుగా మీరు ఎదురుచూస్తున్న ఒక సంబంధం మీ ముందుకు వస్తుంది. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. డాక్యుమెంటేషన్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. చేతికి కుబేర కంకణం ధరించండి మంచి ఫలితాలను సాధిస్తారు.ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ.
మిథునం : మిథున రాశి వారికి ఈ వారం మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కెరియర్ పరంగా మీరు తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ముఖ్యమైన విషయాలలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు నలుగురి సలహాలు సూచనలు తీసుకొని ముందుకు వెళ్లడం మంచిది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంతకాలం వేచి ఉండవలసిన పరిస్థితి. వ్యాపార పరంగా లాభాలు అందుకుంటారు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. విద్యార్థిని విద్యార్థులు కష్టపడి చదవాలి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఈ వారం అనుకూలంగా లేదని చెప్పవచ్చు. స్థిరాస్తులను అమ్మే విషయంలో కొనుగోలు చేసే విషయంలో కొంత జాప్యం ఏర్పడుతుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఏదైనా సంబంధం కుదిరితే అది మంచి సంబంధమా ?కాదా ? అనే విషయాన్ని పూర్తిగా చర్చించి ముందుకు వెళ్లడం అనేది చెప్పదగిన సూచన. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈ రాశి వారు ప్రతి రోజు జిల్లేడు వత్తులతో దీపారాధన చేయండి. శివాలయ దర్శనం చేసుకోండి, గో సేవ తప్పకుండా చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు గ్రీన్.
కర్కాటక రాశి: కర్కాటక రాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలు కొద్దిగా గోచరిస్తున్నాయి. ఆరోగ్య రీత్యా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని అనుకోని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. భూ సంబంధిత వ్యవహారాలలో డాక్యుమెంటేషన్ సంబంధిత వ్యవహారాలలో జాగ్రత్తలు తప్పనిసరిగా అవసరం అవుతాయి. స్థలం అమ్మడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలు ఈ వారం నెరవేరుతాయి. ఉద్యోగం మార్పు కోసం చేస్తున్న వారి ప్రయత్నాలు ఈ వారం ఫలిస్తాయి. సినిమా రంగంలో ఉన్న వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. ఈ రాశి స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా మంచి స్థానం లభిస్తుంది. ఏదైనా ఒక సంస్థ గాని వ్యాపారం గాని నూతనంగా ప్రారంభించే ముందు నలుగురి సలహాలు సూచనలు తీసుకోవడం చెప్పదగినది. అన్నీ మనకే తెలుసు అన్న ధోరణిని పక్కన పెట్టండి. జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండండి. ఈ రాశి వారు ప్రతి రోజు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయండి అలాగే శివాలయ దర్శనం చేసుకోండి. అన్నదాన కార్యక్రమాలు నిర్వహించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్యా 9, కలిసి వచ్చే దిక్కు ఉత్తరం, కలిసి వచ్చే రంగు గ్రే.
సింహరాశి : సింహ రాశి వారికి ఈవారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏ పని చేసినా ముందుకు సాగదు. వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపార పరంగా కూడాను అభివృద్ధి అనేది ఉంటుంది. లీజులు, కాంట్రాక్టులు లభిస్తాయి. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా అవసరం అవుతాయి. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో ఎటువంటి మార్పు ఉండదు. ఉద్యోగం మారాలనుకునే వారు కొంతకాలం వేచి ఉండవలసిన సమయం. జీవిత భాగస్వామితో సఖ్యత ఏర్పరచుకోవాలి లేకపోతే ఇబ్బందులు ఏర్పడే అవకాశం గోచరిస్తుంది. చిన్నచిన్న వ్యాపారస్తులకు స్వయంకృషితో చేసే వ్యాపారాలకు ఈ వారం బాగుంటుంది. అప్పు ఇవ్వడం అప్పు తీసుకోవడం రెండూ కలిసి రావు. వారం చివరలో శుభవార్త వింటారు. ఈ రాశి వారు ప్రతి రోజు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయండి. విద్యార్థులు చదువు మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టండి. ప్రతిరోజు ఆదిత్య హృదయం పారాయణం చేయండి. మేధా దక్షిణామూర్తి రూపును మెడలో ధరించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య 4, కలిసివచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు.
కన్య: కన్య రాశి వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపార పరంగా అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి.ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. మీరు కష్టపడిన దానికి ప్రతిఫలం అనేది తక్కువగా ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి. ప్రముఖులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి. వ్యాపారస్తులకు వ్యాపార పరంగా కొంతవరకు లాభసాటిగా ఉంటుంది. ఈవారం వ్యాపారస్తులకు ఉద్యోగపరంగా చెప్పుకోదగిన స్థాయిలో మార్పులు ఏమీ ఉండవు. చర్మ సమస్యలు మరియు నరాల సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. విద్యార్థినీ విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈ రాశి వారు ప్రతి రోజు ప్రతినిత్యం నవగ్రహ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య రెండు, కలిసివచ్చే దిక్కు ఉత్తరం, కలిసి వచ్చే రంగు తెలుపు.
తుల: తులారాశి రాశి వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపార పరంగా కొంతవరకు లాభసాటిగా ఉంటుందని చెప్పవచ్చు. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. అపాత్ర దానం అనేది మంచిది కాదు. నిజంగా ఎవరికైనా అవసరం అయితేనే సహాయం చేయండి లేకపోతే మౌనంగా ఉండండి. వ్యాపార పరంగా బాగుంటుంది మంచిగా అవకాశాలు కలిసి వస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించే వారు కొంతకాలం వేచి ఉండండి. భాగస్వామ్య వ్యాపారాలలో విభేదాలు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. పిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరమవుతుంది. నిరుద్యోగులైన విద్యావంతులకు మీ అర్హతకు తగిన ఉద్యోగం లభిస్తుంది. ఈ రాశి వారు ప్రతి రోజు ప్రతినిత్యం లక్ష్మీ తామర వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసివచ్చే రంగు బ్లూ.
వృశ్చికం: వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇంటబైటా మీదే పైచేయిగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల పైన శ్రద్ధ వహించడం అనేది చెప్పదగిన విషయం. ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు వ్యాపార పరంగా లాభసాటిగా ఉంటుంది. భూ సంబంధిత వ్యాపారాలు కలిసి వస్తాయి. పౌల్ట్రీ రంగం రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు వస్త్ర వ్యాపారులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. లోన్లు తీసుకోవడం ద్వారా ఎవరికైనా అప్పు ఇవ్వడం ద్వారా ఇబ్బంది పడే పరిస్థితి గోచరిస్తుంది. ఆన్లైన్ మోసాలకు గురికాకుండా జాగ్రత్త వహించండి. బెట్టింగ్ యాప్ లకు దూరంగా ఉండండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య రెండు, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ.
ధనస్సు: ధనస్సు రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపార పరంగా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారస్తులకు వ్యాపార పరంగా బాగుందని చెప్పవచ్చు. నూతన వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి కాలం అనుకూలంగా ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు దైవదర్శనాలు చేసుకుంటారు. మీ పేరు మీద చేసే వ్యాపారాలు కలిసి వస్తాయి. లాభాలు బాగుంటాయి అలాగే ఖర్చులు కూడా దానికి తగ్గట్టుగానే ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది మెరిట్ మార్కులు సాధించడానికి కృషి చేస్తారు.. విదేశాలలో ఉన్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు.
మకరం: మకర రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వీరికి ఏలినాటి శని త్వరలో ముగుస్తుంది. వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపార పరంగా ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది. మీకు మీరుగా తీసుకున్న నిర్ణయాల వల్ల లాభపడతారు. చిన్న చిన్న విషయాలకు ఒత్తిడికి గురికావద్దు. ఈ వారం ప్రథమార్ధం కంటే ద్వితీయార్థం బాగుంటుంది. మీ మనోధైర్యం మీ మేధాశక్తి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపార పరంగా అనుకూల ఫలితాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు ఈ వారం బాగుంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే రంగు గ్రీన్..
కుంభం: కుంభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇంటా బయట కూడా ఎటువంటి ఇబ్బంది లేనటువంటి వాతావరణం ఉంటుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభించకపోగా చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో, దూర ప్రాంతాల ప్రయాణం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారస్తులకు కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా బాగుంటుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభించడానికి కొంత సమయం పడుతుంది. ఓర్పు సహనంతో ముందుకు వెళ్ళండి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఈ రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తుంది. శనికి తైలాభిషేకం చేయించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ.
మీనం: మీన రాశి వారికి ఈ వారం మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి, ఇంట బయట అనుకూలమైన వాతావరణం ఉంటుంది. మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. వ్యాపారస్తులకు గడిచిన రెండు వారాల కంటే కూడా ఈ వారం బాగుంటుంది మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆహార నియమాలు పాటించాలి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా లాభ సాటిగానే ఉంటుంది. దూర ప్రయాణాలు అత్యవసరమైతేనే చేయండి. విద్యార్థులు పరీక్షలకు కష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. వివాహం కాని వారికి మంచి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. నర దిష్టి అధికంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది, కలిసి వచ్చే దిక్కు తూర్పు కలిసి వచ్చే రంగు కాషాయం.