Wednesday, March 26, 2025

బుధవారం రాశి ఫలాలు(26-03-2025)

- Advertisement -
- Advertisement -

మేషం -మీరు ఎంతగా శ్రమించినా పనులు నిదానంగా సాగుతాయి.ఉపయుక్తంలో లేని ఖర్చులు చోటు చేసుకుంటాయి. అయితే అవి చిరకాలంలోనే బంగారు బాటగా భవిష్యత్తు కనబడుతుంది.

వృషభం -మిత్ర బృందాలు అండగా నిలుస్తాయి. విహార యాత్రలు చేస్తారు. మీ ఊహలు నిజమవుతాయి. ఆర్థిక విషయాలలో పురోగతిని సాధిస్తారు.రుణ బాధలు కొంత తీరతాయి.

మిథునం -దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. బంధుమిత్రులను కలుసుకొని ఉత్సాహంగా గడుపుతారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

కర్కాటకం -కార్యాలయంలో సాటి ఉద్యోగస్తులతో మాట పట్టింపులు వస్తాయి. తగిన జాగ్రత్త అవసరం నూతన కార్యక్రమాలను ప్రారంభించడానికి గాను అనేకమైన ఆలోచనలు కొనసాగిస్తారు.

సింహం -సాంకేతిక కారణాల వలన పనులు నిదానంగా సాగుతాయి.ప్రతి పనిలో అలసత్వం ఏర్పడుతుంది. హాని కలిగించే నిజం కన్నా హాయిగోలిపే అబద్ధమే మేలని గ్రహించండి.

కన్య -పట్టువిడుపు ధోరణి కనబరచండి. గతంలో దూరమైన సన్నిహిత వర్గం తిరిగి మీకు చేరువయ్యే సూచనలు గోచరిస్తున్నాయి. కొన్ని బాధ్యతల నుండి ఉద్దేశపూర్వకంగానే తప్పుకుంటారు,

తుల -వృత్తి వ్యాపారాలలో ఆటుపోట్లు ఎదురైనా అధిగమిస్తారు. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి. లేనిపోని నిందలు మీపై మోపే వ్యక్తులు మీ చుట్టూ ఉన్నారని గ్రహించండి.

వృశ్చికం -ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబ సమస్యలు కొంతవరకు తీరతాయి. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. సంఘసేవ కార్యక్రమాలకు మీ వంతుగా తగిన సహాయ సహకారాలు అందిస్తారు.

ధనుస్సు -మీ అంచనాలు కొన్ని విషయాలలో నిజమవుతాయి.కృషి వ్యర్థము కాదు అన్న సంగతి కొన్ని సంఘటన వలన రుజువు అవుతుంది. మానసిక ఆనందం కలిగి ఉంటారు.

మకరం – పంతానికి పోకుండా చర్చలతో సమస్యలను పరిష్కరించుకుంటారు. ప్రత్యర్థుల రాజకీయ పలుకుబడి మీ విషయంలో పనిచేయదు. మానసిక ప్రశాంతతకు గాను యోగా వంటి వాటిపైన దృష్టిని సారిస్తారు.

కుంభం -గతంలో వదులుకున్న అవకాశాలను తిరిగి దక్కించుకునే ఆలోచనలు చేస్తారు. ఆర్థిక లావాదేవీలు  లాభసాటిగా సాగుతాయి.ముఖ్యమైన వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు.

మీనం -సన్నిహితుల నుండి సహాయం అందుతుంది. పర్యటనలు ఫలప్రదం అవుతాయి. పోటీ పరీక్షలలో విజయం సాధించగలుగుతారు. సాంకేతిక విద్యా అవకాశాలు లభిస్తాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News