Sunday, December 22, 2024

సోమవారం రాశి ఫలాలు(26-08-2024)

- Advertisement -
- Advertisement -

మేషం – ఆర్థికపరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. మీ గురించి చెడుగా ప్రచారం చేసే వ్యక్తుల నుండి దూరంగా ఉండటం మంచిది.ఆర్థికపరమైన సమస్యలు పెద్దల సహకారం వల్ల సానుకూల పడతాయి.

వృషభం – ఆరోగ్యం పట్ల తగు శ్రద్దను తీసుకోవడం మంచిది. జీవిత భాగస్వామి అభిప్రాయాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వవలసిన స్థితి వస్తుంది. ఆర్థిక పరిస్థితి కొంతవరకు అనుకూలంగా ఉంటుంది.

మిథునం – వృత్తి ఉద్యోగాలలో వ్యాపారంలో పలు మార్పులు చేసి లాభపడతారు. చాలా కాలం పరిష్కారం కానీ సమస్యలు కొంతమేర మీకు అనుకూలమవుతాయి.

కర్కాటకం – కళా సాహిత్య రంగాల్లో ఉన్నవారికి ప్రభుత్వం నుండి కొన్ని అవార్డులు లభిస్తాయి. పెట్టుబడులు అనుకూలిస్తాయి. సంతాన విద్యా విషయంలో మీకు కొంత ఆందోళన తప్పదు.

సింహం – విదేశీ సంబంధిత విషయాలు అనుకూలిస్తాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. దూరప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. క్రీడా రంగానికి సంబంధించిన విషయాలు కలిసి వస్తాయి.

కన్య – విందు, వినోదాలలో పాల్గొంటారు. వృత్తి- ఉద్యోగాలలో మీ పై అధికారుల ఒత్తిడి అధికమవుతుంది. ఆత్మీయులతో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు.

తుల – ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. వాతావరణంలో స్వల్ప మార్పుల వలన ఆరోగ్యం మీద కొంతమేర ప్రభావం ఉంటుంది. జాగ్రత్త వహించండి.

వృశ్చికం – సొంత విషయమై అధిక ఖర్చులను చేస్తారన్న విమర్శలకు సంఘటనలే సమాధానం చెబుతాయి. ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టులు లాభిస్తాయి.

ధనుస్సు – పాస్పోర్ట్ వీసాలకు సంబంధించిన విషయాలలో సాంకేతిక లోపాలు రాకుండా జాగ్రత్త వహించండి. మీ కుటుంబ సభ్యులకు ప్రేమాభిమానాలు మీ సమస్యను కదల్చివేస్తాయి.

మకరం – ప్రత్యర్థుల రాజకీయ పలుకుబడి మీ విషయంలో పనిచేయదు. ఏది ఏమైనా వివాదాలకు కోపతాపా లకు దూరంగా ఉండండి. మొండికేసిన స్థిరాస్త్రి రిజిస్ట్రేషన్ కాకుండానే స్వాధీనంలోకి వచ్చుట జరుగుతుంది.

కుంభం – స్త్రీలకు సంబంధించిన వివాదములలో మీ పేరును లాగబడే అవకాశం ఉన్నది తగిన జాగ్రత్త వహించండి. చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు.

మీనం – వృత్తి ఉద్యోగాలలో కొన్ని అనుకోని మార్పులు వస్తాయి. అనవసరమైన పరిశీలనలో ఉండుట చేత ప్రశాంతత తగ్గుతుంది.

Saturday rasi phalalu

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News