మేషం -ఉద్యోగయత్నాలలో అనుకూలత ఏర్పడుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు లాభాలు పొందగలుగుతారు. సన్నిహితులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు.ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం.
వృషభం -ఉద్యోగులకు విధి నిర్వహణలో ఆటంకాలు చిక్కులు ఎదురవుతాయి. మాటల చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుని ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు.
మిథునం -ఆర్థిక అభివృద్ధి కొరకు విశేషంగా కృషి చేస్తారు.కుటుంబం సభ్యులతో ఉన్నటువంటి అపోహలు అనుమానాలు సమసిపోతాయి సంబంధ బాంధవ్యాలు మరింతగా బలపడతాయి.
కర్కాటకం – ప్రచురణ, స్టేషనరీ వ్యాపారస్తులకు కాలం అనుకూలం. నిర్మోహమాటవైకారిని అవలంబిస్తారు. సహోదర సహోదరి వర్గమునకు మీ శక్తికి మించి సహాయ సహకారాలు అందిస్తారు.
సింహం -పొదుపు చేసిన ధనాన్ని కొత్త పెట్టుబడిగా పెడతారు. లిటిగేషన్ మనస్తత్వం కలిగిన వారి వలన చికాకులు తప్పకపోవచ్చు వారిని దూరం పెట్టడం మేలని గ్రహిస్తారు.
కన్య -సంతాన పురోగతి మీరు ఊహించిన దానికన్నా మెరుగ్గా ఉంటుంది.ఆశించిన విధంగా కాకపోయినా బ్యాంకు రుణాలు మంజూరు అవుతాయి. వ్యాపారపరమైన చర్చలు ఊపందుకుంటాయి.
తుల -అంతంత మాత్రంగా ఉన్న పరిచయాలను బలపరుచుకునే యత్నాలకు కాలం అనుకూలంగాఉంది. మిత్రుల నుండి మందలింపులను ఎదుర్కొంటారు.మీ ప్రణాళికలో మార్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది
వృశ్చికం -రాని బాకీల వసూలు తలకు మించిన భారం అవుతుంది. గతంలో చేయించిన ఇన్సూరెన్స్లు ఉపయోగకారిగా పరిణమిస్తాయి. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తారు.
ధనుస్సు -కొంత ధనాన్ని అడ్వాన్సులుగా ఇస్తారు. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలపరంగా చెప్పుకోదగిన మార్పులు గోచరించడం లేదు.
మకరం -గాడి తప్పుతున్నాయని భావించిన వ్యవహారాలను క్రమ పద్ధతిలో నడిపించడానికి కృషి చేస్తారు. అనవసర విషయములతో కాలయాపన సూచనలు గోచరిస్తున్నాయి.
కుంభం -ఆదాయ వ్యయాలలో సమతుల్యత ఏర్పడుతుంది. కీలకమైన నిర్ణయాలను తీసుకుంటారు భవిష్యత్తు ప్రయోజనాలదృష్ట్యా కొత్త పెట్టుబడులను పెడతారు.
మీనం -విందు వినోద కార్యక్రమాలలో నూతన పరిచయాలు ఏర్పడతాయి.అప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది.ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది.