Sunday, January 19, 2025

శనివారం రాశి ఫలాలు(27-04-2024)

- Advertisement -
- Advertisement -

మేషం – పనులలో కొంత జాప్యం ఏర్పడుతుంది. వివాహ ఉద్యోగ ప్రయత్నాలలో తొందరపాటు వద్దు. సంతానానికి ఉన్నత విద్య అవకాశాలు కలిసి వస్తాయి. రాజకీయ నాయకులతో మిత్రత్వం ఏర్పడుతుంది.

వృషభం – వృత్తి – ఉద్యోగ వ్యాపారాల పరంగా బాగుంది. ఇతరుల విషయాలలో తలదూర్చకుండా మీ పని మీరు చేసుకుని పోవడం మంచిది.ఆర్థికపరమైన వ్యవహారాలలో స్వల్ప మార్పులు చోటు చేసుకుంటాయి.

మిథునం – కాంట్రాక్టులు సబ్ కాంట్రాక్టులు లభిస్తాయి. కొంత వాగ్వివాదాలు చోటుచేసుకుంటాయి.వాటి వలన నష్టాలు అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతారు. దైవ చింతన కలిగి ఉంటారు.

కర్కాటకం – వృత్తి ఉద్యోగాలపరంగా సముచితమైన స్థానాన్ని సాధించడానికి విశేషమైన కృషిని చేస్తారు. ఆర్థికపరమైన అంశాల పైన దృష్టిని సారిస్తారు. సానుకూల ఫలితాలను కూడా సాధిస్తారు.

సింహం – పుకార్లు ప్రచారంలో ఉంటాయి. మీకు సంబంధించిన వ్యక్తిగత రహస్యాలను బహిర్గతం చేస్తున్న వ్యక్తులను కట్టుదిట్టంగా పట్టుకోగలుగుతారు. పదునైన వస్తువులకు దూరంగా ఉండండి.

కన్య – ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. అనుకొని అవకాశాలు లభిస్తాయి వాటిని సద్వినియోగం చేసుకుంటారు.  సంతానం యొక్క చదువు విషయాలలో సానుకులమైన నిర్ణయాలు తీసుకుంటారు.

తుల – మీరు తలపెట్టిన అన్ని పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా జరుగుతాయి. కుటుంబ విషయాలలో పురోగతికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. కొత్త రుణాలు చేస్తారు.

వృశ్చికం – నూతన ఉద్యోగ అవకాశాలను అన్వేషించడంలో సఫలం కాగలరు. విద్యార్థిని విద్యార్థులకు అనుకూలమైన కాలం. మొండి బాకీలు వసూలు అవుతాయి. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు.

ధనుస్సు – ఆర్థికపరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఆధునిక కాలానికి తగినట్లుగా మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి మీ జీవనశైలి పై దృష్టిని సారిస్తారు. శక్తికి మించి శ్రమిస్తారు.

మకరం – క్రమశిక్షణకు ప్రాధాన్యతని ఇస్తారు. ఆర్థికపరమైన అంశాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఓ పొరపాటు సమాచారాన్ని విని అదే నిజమని భ్రమపడతారు. అనుకోని అవకాశాలు మీకు చేతికి అందుతాయి.

కుంభం – వ్యాపార వ్యవహారాలు సున్నితమైన అంశాలతో ముడిపడి ఉంటాయి. దూరప్రాంత ప్రయాణాల తాలూకు తేదీలను ఖరారు చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది.

మీనం – ఏ విషయంలోనూ తొందరపడకుండా సమయమును పాటిస్తూ సమయం కోసం వేచి ఉంటారు. ఇంచుమించుగా అన్నింటిలో ఎంతో కొంత లాభపడతారు.అనారోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెడతాయి.

Saturday rasi phalalu

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News