Wednesday, January 22, 2025

మంగళవారం రాశి ఫలాలు(27-08-2024)

- Advertisement -
- Advertisement -

మేషం – ఆర్థికంగా పురోగతి బాగుంటుంది. మీకు న్యాయం చేయవలసిన వాళ్లు సంపూర్ణంగా న్యాయం చేయరు. స్థిరాస్తులకు సంబంధించిన వివాదాలు ఒక పరిష్కార దశకు చేరుకుంటాయి.

వృషభం – వృత్తి వ్యాపారములు, రాజకీయపరమైన వ్యవహారములు అనుకూలిస్తాయి. ఆత్మీయుల వలన మానసికంగా కొంత అశాంతి ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు కుదుటపడతాయి.

మిథునం – దీర్ఘకాలిక సమస్యలు తీరిపోతాయి. వ్యాపార సంబంధమైన విషయాలు బాగున్నాయి.  వ్యాపారంలో నూతన మార్పులు చేర్పులు కలిసి వస్తాయి. ప్రజాధరణ బాగుంటుంది.

కర్కాటకం – ముఖ్యమైన సమావేశాలకు ఆహ్వానాలు అందడం మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది. అందరిలోనూ ప్రత్యేక గుర్తింపు పొందుతారు. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండటం అన్ని విధాల మంచిది.

సింహం – ఉద్యోగాలలో ఎదురైన సమస్యలు తీరుతాయి.భూ వివాదాలు తిరిగి నూతన ఒప్పందాలు కుదురుతాయి. ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారే సూచనలు ఉన్నాయి.

కన్య – ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. బంధువుల నుండి కీలక సమాచారం అందుకుంటారు.  ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు చాలా అవసరం. జీవిత భాగస్వామి నుండి సహాయ సహకారాలు అందుతాయి.

తుల – కాంట్రాక్టులు శ్రమానంతరం దక్కుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. కోపతాపాలకు దూరంగా ఉండండి.

వృశ్చికం – పనులలో జాప్యం జరిగిన చివరకు పూర్తి చేస్తారు. ఇతరుల విషయాలలో జోక్యం తగదు. బంధువుల నుండి కీలక సమాచారం అందుకుంటారు.ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంటుంది.

ధనుస్సు – ఇంటాబయట కొంత అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగాలలో స్వల్ప మార్పులు ఉంటాయి. పారిశ్రామిక, రాజకీయ రంగాలలోని వారికి కొంత అనుకూలంగా ఉంటుంది.

మకరం – ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తి చేస్తారు. రాజకీయ నాయకులు, ఉన్నతాధికారుల వద్ద పలుకుబడి ఉన్న ఉపయోగించుకోవడానికి ఇష్టపడరు. క్రయవిక్రయాలలో స్వల్ప లాభాలు గడిస్తారు.

కుంభం – నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. విందులు వినోదాలకి సాధ్యమైనంత దూరంగా ఉంటారు. అయినప్పటికీ కొన్ని విందులు వినోదాలకు వెళ్ళవలసి వస్తుంది. ఎదుటి వాళ్ళ ఆంతర్యం అర్థం అవుతుంది.

మీనం – దీర్ఘకాలిక సమస్యలు తీరిపోతాయి. ఆర్థిక పరిస్థితులు కుదుటపడతాయి. నూతన వృత్తి వ్యాపార ఉద్యోగాల మీద దృష్టి పెడతారు. మీ జీవిత ఆశయం నెరవేర్చుకోవడానికి రాత్రింబవళ్లు శ్రమిస్తారు.

Saturday rasi phalalu

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News