మేషం – నిరుద్యోగులకు ఉద్యోగ పరంగా శుభవార్త వినే సూచన ఉంది. మీ శక్తికి మించి కష్టపడతారు. ఫలితాలను కూడా అదే విధంగా సాధిస్తారు. ఖర్చులు అధికమవుతాయి.
వృషభం – స్వయంక్రుతాపరాధాలు పదేపదే చోటు చేసుకోవడం వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు. వైరీవర్గం కుట్రలను భంగం చేయగలుగుతారు. విలువైన సమాచారం అందుతుంది.
మిథునం – ఆర్థిక వ్యవహారాలు మినహా మిగతా విషయాలు అనుకూలంగానే ఉంటాయి.ఉన్నతాధికారులతో జరిపే చర్చల వలన లాభపడతారు. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.
కర్కాటకం – చాలా కాలంగా పెండింగ్లో ఉన్న విషయాలను కొలిక్కి తీసుకురాగలుగుతారు. రాజకీయ పరమైనటువంటి వ్యవహారాలు సానుకూల పడతాయి. లిటిగేషన్ వ్యవహారాలు సానుకూల పడతాయి.
సింహం – ప్రభుత్వపరమైన లీజులు లైసెన్సులు సాధించడానికి గాను మీరు చేసే ప్రయత్నాలలో సాంకేతిక లోపాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార పరంగా స్వల్ప అభివృద్ధిని సాధించగలుగుతారు.
కన్య – టీం వర్క్ ను టీం స్పిరిట్ తో పూర్తి చేస్తారు. మీ ఆశయాలను నెరవేర్చుకోవడానికి గాను అరుదైన అవకాశాలు కలిసి వస్తాయి. సానుకూల ఫలితాలను సాధిస్తారు.
తుల – ప్రయోజనాలను సాధించుకోవడానికి గాను మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సహోదర సహోదరి వర్గంతో అభిప్రాయ బేధాలు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయి.
వృశ్చికం – అధికారులతో ముఖాముఖి చర్చలను సాగిస్తారు. అనాధాశ్రమాలను సందర్శిస్తారు. అపనిందలకు భయపడకుండా మీరు చేయదలుచుకున్న పనులు నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు.
ధనుస్సు – విద్యాభివృద్ధిని సాధించడానికి నూతనమైన కోర్సులలో సభ్యత్వాన్ని తీసుకుంటారు. రాజకీయాలు విదేశీయాన విషయాలు అనుకూల దిశలో ఉంటాయి. స్వల్ప ధన లాభ సూచన.
మకరం – మీరు అనుకున్న విధంగా ప్రణాళికాలను అమలుపరచడానికి గాను గ్రహస్థితి అనుకూలంగా లేదని గ్రహించండి. పంచాయతీలు మధ్యవర్తి పరిష్కారాలు కోర్టు వ్యవహారాలు కాలహరణానికి కారణం అవుతాయి
కుంభం – ఆదాయ వ్యయాలు సరి సమానంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో సామరస్యంగా వ్యవహరించి కుటుంబ వాతావరణాన్ని అనుకూలంగా మలుచుకుంటారు. ప్రశాంతమైన వాతావరణం ఏర్పరచుకో గలుగుతారు.
మీనం – మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి వినోద కార్యక్రమాల పట్ల ఆసక్తిని కనబరుస్తారు. వ్యాపారపరమైన వ్యవహారాలలో గోప్యంగా వ్యవహరిస్తారు. నూతనమైన అగ్రిమెంట్స్ చేసుకోగలుగుతారు.
సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్
9014126121, 8466932225