Monday, March 31, 2025

శుక్రవారం రాశి ఫలాలు(28-03-2025)

- Advertisement -
- Advertisement -

మేషం -చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. భూములకు సంబంధించిన అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలు లభిస్తాయి.

వృషభం -ప్రముఖులతో ఉత్తర, ప్రత్యుత్తరాలు సాగిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.  వ్యవసాయదారులకు పెట్టుబడులకు సంబంధించి సహాయ సహకారాలు అందుతాయి.

మిథునం – వృత్తి- వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగయత్నాలు కలిసివస్తాయి.సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు పాటించండి. స్వల్ప ధన లాభాలు పొందుతారు.

కర్కాటకం -సాంకేతిక పరిశోధనా రంగాల వారికి అప్రయత్న కార్యసిద్ధి లభిస్తుంది. ఇంటా బయటా  ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు కాస్త ఊరటను కలిగిస్తాయి.

సింహం -దూరప్రాంతాల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. ముఖ్యమైన పనులలో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు,

కన్య -ప్రయత్నాలు అనుకూలిస్తాయి. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలను చేపడతారు. నూతన విద్య ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

తుల -ఆలోచనలకు కార్యరూపాన్ని ఇచ్చి నూతన వ్యాపారాలను ప్రారంభించే సూచనలు ఉన్నాయి. స్వయం కృతాపరాధాలు చోటుచేసుకుంటాయి.కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన అంశాలు లాభిస్తాయి.

వృశ్చికం -అటువృత్తి – ఉద్యోగ విషయంలో గాని, ఇటు కుటుంబ వ్యవహారాలలో గాని శారీరకంగా మానసికంగా శ్రమిస్తారు. కొంత ఒత్తిడికి లోనవుతారు. ఇష్టదైవ సందర్శన మేలు కలిగిస్తుంది.

ధనుస్సు -అనతి కాలంలో ప్రారంభించబోయే వ్యాపారాల నిమిత్తం,నిర్వహించవలసిన శుభకార్యాల నిమిత్తం కావలసిన వనరులను సమకూర్చుకోగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మకరం – బంధు వర్గంతో అభిప్రాయ భేదాలు చోటు చేసుకుంటాయి. ఎంతగానో శ్రమించి వ్యయ ప్రయాసల కోర్చి ఓ కార్యక్రమాన్ని పూర్తి చేయగలుగుతారు.ధనం అధికంగా ఖర్చవుతుంది.

కుంభం -విద్యార్థిని విద్యార్థులు మరింత శ్రద్ధను కనబరచవలసి ఉంటుంది.నిర్మాణ సంబంధమైన విషయాలు, స్పెక్యులేషన్ కు సంబంధమైన విషయాలలో ఆచితూచి వ్యవహరించడం చెప్పదగినది.

మీనం -కుటుంబ సమస్యల పైన దృష్టిని సారిస్తారు. సామాజిక సేవ కార్యక్రమాలలో పాలుపంచుకుంటారు. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. నూతన వ్యాపారాలను ప్రారంభిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News