Sunday, January 19, 2025

ఆదివారం రాశి ఫలాలు(28-04-2024)

- Advertisement -
- Advertisement -

మేషం – దీర్ఘకాలిక సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. గృహం మార్పు చేయాలన్న ఆలోచనలు చోటు చేసుకుంటాయి. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. అనుకోని ప్రయాణాలు చేస్తారు.

వృషభం – కొత్త విషయాలు తెలుసుకుంటారు. బంధువుల నుండి శుభవార్తలు అందుకొంటారు.జీవిత భాగస్వామి నుండి ఆస్తి లాభం పొందుతారు. సంతానంనకు సాంకేతిక విద్యావకాశాలు.

మిథునం – ఇంటాబయట ప్రోత్సాహం లభిస్తుంది. అనుకోని అవకాశాలు లభిస్తాయి. కీలక నిర్ణయాల్లో తొందరపాటు వద్దు. దీర్ఘకాలికంగా వేధిస్తున్న అనారోగ్య సమస్యలు నుండి ఉపశమనం లభిస్తుంది.

కర్కాటకం – పనులు సాఫీగా సాగుతాయి. స్నేహితులను కలిసి ఆనందంగా గడుపుతారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. అవసరానికి ధనం చేతికి అందుతుంది. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

సింహం – ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. కీలక నిర్ణయాల సొంత ఆలోచనలు శ్రేయస్కరం.

కన్య – కొత్త వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. విందు వినోదాలు శుభకార్యాలలో పాల్గొంటారు. స్నేహితులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఆరోగ్య విషయంలో మెలకువ అవసరం.

తుల – విందు వినోదాల ద్వారా కొత్త పరిచయాలు ఏర్పడతాయి.ఉపకరిస్తాయి కూడా. ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. వైరి వర్గంతో కొంత  అప్రమత్తంగా మెలగడం మంచిది.

వృశ్చికం – ఆర్థిక విషయ వ్యవహారాలు పరిష్కరించుకోవడం కష్టతరంగా మారుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు నూతన ఒప్పందాలు లాభిస్తాయి. కుటుంబంలో ఏర్పడిన చికాకులు తొలుగుతాయి.

ధనుస్సు – ప్రయాణాలు లాభిస్తాయి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. ఏ విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు చేయవద్దు. మానసికంగా ధైర్యాన్ని పెంపొందించుకుంటారు.

మకరం – ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వున్న అవసరాలకు డబ్బు అందుతుంది. దూరప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది. దైవ చింతన కలిగి ఉంటారు. ఆరోగ్యం కుదుటపడుతుంది.

కుంభం – నూతన ఉత్తేజం కలిగి ఉంటారు. వివాదాలకు దూరంగా ఉండండి. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. పనులు నిదానంగా సాగుతాయి. మొండి బాకీలు వసూలు అవుతాయి.

మీనం – ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. విలువైన వస్తు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్య, వాహనాల విషయాలలో జాగ్రత్తలు అవసరం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News