Saturday, December 28, 2024

శనివారం రాశి ఫలాలు(28-12-2024)

- Advertisement -
- Advertisement -

మేషం – అనుమానం ఉన్న పద్దులను, జమా ఖర్చులను సరిచూసుకోవడం వలన లాభపడతారు. ఆర్థికపరమైన విషయాలలో మెలకువలు వహించండి. రొటీన్స్ సంతకాల విషయంలో జాగ్రత్తలు అవసరం.

వృషభం – ఆర్థిక సంస్థల్లో పనిచేస్తున్న వారు ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహించాలి. మీ మంచితనాన్ని అసమర్థతగా భావించిన వాళ్లు కీలక సమయంలో మీ చేతిలో భంగపడతారు.

మిథునం –  కొన్ని ప్రతిష్టాత్మకమైన కాంట్రాక్టులు మీకు దక్కుతాయి. నిర్మాణ సంబంధమైన పనులు చురుకుగా సాగటం వల్ల ఆర్థిక పరిస్థితి ఓ గాడిన పడుతుంది.

కర్కాటకం – సాంకేతిక రంగాలలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ప్రేమ వివాహాలు సఫలం కావు. పరిశోధనా రంగంలోని వారికి అనుకూలంగా ఉంటుంది.

సింహం – మీ గుడ్విల్ మిమ్మల్ని కాపాడుతుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. స్థిరాస్తుల అభివృద్ధి బాగుంటుంది. జీవిత భాగస్వామితో అన్ని విషయాలు అరమరికలు లేకుండా పంచుకుంటారు.

కన్య – అనుకోని అవకాశాలు లభిస్తాయి. నిద్రాహారాలను లెక్కచేయకుండా శ్రమిస్తారు. శ్రమకు తగిన ఫలితాలను పొందగలుగుతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు వహించండి.

తుల – భాగస్వామి వ్యాపారాలను విస్తరిస్తారు. చేపట్టిన కార్యక్రమాలు అభివృద్ధి సంతృప్తికరంగానే ఉంటాయి. ప్రభుత్వ సంబంధమైన ప్రైవేట్ సంబంధమైన కాంట్రాక్టులు రెన్యువల్స్ అనుకూలిస్తాయి.

వృశ్చికం – ఆదాయం పెంచుకునే మార్గాలు అన్వేషిస్తారు. అందులో విజయం సాధిస్తారు. అనుకోని అతిధుల నుండి ఆహ్వానాలు అందుతాయి. ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం.

ధనుస్సు – ఇతర భాషలను నేర్చుకునే ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యాసంబంధమైన విషయాలలో మీరు కోరుకున్న పురోగతి లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్న సమయానికి డబ్బు చేతికందును.

మకరం – భూముల కొనుగోలు అమ్మకాల విషయంలో మీ ఓర్పు, సహనం, మాటల చాతుర్యం వల్ల లాభపడతారు. రాజకీయంగా ఉన్నత స్థానంలో ఉన్నవారు ముఖ్యమైన అధికారులు మిమ్ములను ఆదరిస్తారు.

కుంభం – ఉత్సాహవంతమైన వాతావరణం ఏర్పడుతుంది. విందులు వినోదాలలో పాల్గొంటారు. స్త్రీలకు సంబంధించిన దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు.

మీనం – భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి లాభాలు ఓ మోస్తరుగా ఉంటాయి. భాగస్వామి వ్యాపారంలో మీరే కేంద్ర బిందువు అవుతారు.

Saturday rasi phalalu

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News