Thursday, January 23, 2025

గురువారం రాశి ఫలాలు(29-02-2024)

- Advertisement -
- Advertisement -

మేషం –కుటుంబ సమస్యలు ఎదురైన అధిగమిస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. దూర ప్రాంతాల నుండి ఆసక్తికర సమాచారం అందుతుంది. విందు, వినోదాలు, సంతానంనకు యత్న కార్యసిద్ధిపొందుతారు.

వృషభం –ప్రయాణాలలో తొందరపాటు వద్దు. పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదురైన అధిగమిస్తారు. బంధువర్గంతో ఏర్పడిన తగాదాలు పరిష్కారించుకొంటారు. ఉద్యోగాలలో స్థానమార్పులు.

మిథునం –ఇంటాబయటా ఏర్పడిన చికాకులు కొంతవరకు తొలుగుతాయి. ఆరోగ్యం, వాహనాల విషయాలలో నిర్లక్ష్యం తగదు. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు. సంతానంనకు విద్యా, ఉద్యోగవకాశాలు పొందుతారు.

కర్కాటకం – కొత్త పనులకు శ్రీకారం చుట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు. సోదరుల నుండి ధన, వస్తులాభం.

సింహం –కుటుంబ సభ్యులలో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకొంటారు. గృహనిర్మాణ ఆలోచనలలో తొందరపాటు వద్దు. దూరప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందం కలుగుతుంది. ఆరోగ్యం పట్ల మెలుకవ అవసరం .

కన్య – బంధువులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. స్థిరాస్థి వృద్ధి చెందుతుంది. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కారం. సంతానంనకు సాంకేతిక విద్యావకాశాలు పొందుతారు. ఉద్యోగాలలో ప్రోత్సాహం వస్తు లాభం.

తుల –మిత్రులతో ఏర్పడిన కలహాలు పరిష్కరించుకొంటారు. పనులు నెమ్మదిగా సాగుతాయి.  భూముల క్రయ విక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. వాహన యోగం.

వృశ్చికం –నూతన మిత్రులు పరిచయమై కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. భూవివాదాలు తీరీ నూతన ఒప్పందాలు కుదురుతాయి. శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. పాత బాకీలు వసూలవుతాయి. శుభవార్తలు.

ధనుస్సు –ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. బంధువుల నుండి శుభవార్తలు అందుకొంటారు. ఉద్యోగాలలో ఏర్పడిన ఇబ్బందులు తొలుగుతాయి. నూతన వస్తు సేకరణ.

మకరం –ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమకు తగిన ఫలితం కష్టమే. పనులో జాప్యం జరిగిన పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో ఎదురైన ఒత్తిడులు తొలుగుతాయి. జీవిత భాగస్వామి నుండి ఆస్తి లాభం.

కుంభం –ముఖ్యమైన కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురైన సన్నిహితుల సాయంతో పూర్తి చేస్తారు. అనుకోని అతిథులను కలిసి కీలక సమాచారం అందుకొంటారు. వృత్తి, వ్యాపారాలలో లాభాలు పొందుతారు.

మీనం –కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. తండ్రి నుండి ధనలాభం పొందుతారు. భూముల క్రయవిక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు.

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News