Friday, December 27, 2024

సోమవారం రాశి ఫలాలు(29-04-2024)

- Advertisement -
- Advertisement -

మేషం – వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా చెప్పుకోదగిన మార్పులు ఏవి ఉండవు. ఆర్థికంగా లాభనష్టాలు రెండు ఉండవు.విద్యార్థిని విద్యార్థులు నూతన విద్యను అభ్యసించడానికి అనేక ఆలోచనలను కొనసాగిస్తారు.

వృషభం – ముందుకు పడిన పనులను సాధించుకోగలుగుతారు. మిత్రులతో కలిసి వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.రాజకీయపరంగా చర్చలు సాగిస్తారు. తరతమ భేదం లేకుండా అందర్నీ కలుపుకొని పనిచేస్తారు.

మిథునం – ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. గతంలో వద్దనుకున్న అవకాశాలు తిరిగి అనుకూలం చేసుకునే ప్రయత్నాలను పట్టుదలగా చేస్తారు. మానసిక సంఘర్షణ మాత్రం తీరదు.

కర్కాటకం – లక్ష్యసాధన ధ్యేయంగా అడుగులు ముందుకు వేస్తారు. మీ ప్రణాళికలు వ్యూహాలు చాలా వరకు ఫలిస్తాయి. పారిశ్రామిక పెట్టుబడుల విషయంలోనున్న సందేహాలు తొలగిపోతాయి.

సింహం – తలపెట్టిన పనులలో స్వయంకృతాపరాదాలు చోటు చేసుకుంటాయి. న్యాయవాదులతోటి చర్చలు సాగిస్తారు. వృత్తి ఉద్యోగాలపరంగా చేసే చిన్నపాటి ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

కన్య – వ్యాపార కేంద్రాలలో లాభాలను అందుకోగలుగుతారు. దైనందిన కార్యక్రమాలలో స్వల్పమైన మార్పులను చేసే సూచనలు ఉన్నాయి. జీవిత భాగస్వామి సలహాలను సంప్రదింపులను పాటిస్తారు.

తుల – మీరంటే గిట్టని వారు మిమ్మల్ని ఇరుకున పెట్టే ప్రయత్నాలు సాగిస్తారు.అయితే ఆ ప్రయత్నాలు ఏవి ఫలించవు. ఈ మెయిల్స్ ని సరైన సమయంలో చూసుకోవడం ద్వారా అనేక అవకాశాలను చేజార్చుకోని వారు అవుతారు.

వృశ్చికం – మీరు స్వయంగా తీసుకున్న కఠిన నిర్ణయాలు అమలు పరుస్తారు. జీవితంలో ప్రఖ్యాతిని సాధించడానికి అనుకూలమైన మార్గాలను అన్వేషించడంలో సఫలతను సాధించగలుగుతారు.

ధనుస్సు – మిత్రుల సలహాల మేరకు వైద్యున్ని మార్పు చేసేందుకు గాను చర్యలను చేపడతారు. వృత్తి ఉద్యోగాలపరంగా మీ స్థాయి యధాతధంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది

మకరం – పక్షపాత ధోరణి అవలంబించకుండా అందరినీ సమన్యాయంతో ఆదరిస్తారు. అదేవిధంగా ఎదుటివారు కూడా మీ పట్ల సమన్యాయంతో వ్యవహరించాలని భావిస్తారు. కానీ ఈ విషయంలో మీకు ఆశాభంగం కలుగుతుంది.

కుంభం – కీర్తి ప్రతిష్టల కోసం ఎక్కువగా ప్రాకు లాడుతారు.అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. కార్యాలయలలో వ్యాపార కేంద్రంలో అనుకూల ఫలితాలను సాధించగలుగుతారు.

మీనం – శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. ధైర్యం లేని మనిషిగా దుష్ప్రచారాలు చోటు చేసుకుంటాయి.  అయితే అవి ప్రాథమిక దశలోనే సర్థుబాటు కావడం వలన మనశ్శాంతిని పొందుతారు.

Saturday rasi phalalu

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News