మేషం – ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్య సమస్యలు ఎదురయి చికాకులు పెడతాయి. కార్యాలయాలలో మీ స్థానాన్ని పదులపరచుకోవడానికి చేసే చర్యలు అనుకూలిస్తాయి.
వృషభం – చెల్లింపులను సకాలంలో చెల్లించగలుగుతారు. వ్యాపార పరంగా లాభాలు చేతికంది వస్తాయి. పనిభారం వలన ఎంత సమయం ఉన్న సరిపోదు. బాధ్యతలు పెరిగిన సమర్థవంతంగా నిర్వహిస్తారు,
మిథునం – పెట్టుబడిలో తగిన లాభాలు పొందుతారు. సంతాన విద్య అవసరాలకు పుస్తకాలు లేక తత్సంబంధమైన వాటిని కొనుగోలు చేస్తారు. కుటుంబంలోని మనస్పర్దాలు తీరి ప్రశాంతతను పొందుతారు.
కర్కాటకం – మీ ఆలోచనలు కొంతవరకు కార్యరూపాన్ని సంతరించుకుంటాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంటుంది. సన్నిహితులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు.
సింహం – ఉద్యోగ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. చిరకాల మిత్రులను కలుసుకొని కష్టసుఖాలను పంచుకుంటారు. చాకచక్యంగా వ్యవహారాలు పూర్తి చేస్తారు. మీలోని ప్రతిభకు గుర్తింపు పొందుతారు.
కన్య – వ్యక్తిగత అభివృద్ధిని మరింతగా పెంచుకోవడానికి మార్గాలను అన్వేషిస్తారు. వృత్తిపరంగా వృద్ధి కనబడుతుంది. చెల్లించవలసిన చెల్లింపులను సకాలంలో చెల్లించడానికి విశేషంగా కృషి చేస్తారు.
తుల – ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న విధంగా సాగుతాయి. సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. ఆహ్లదకరమైన వాతావరణం ఏర్పడుతుంది.
వృశ్చికం – అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. దీర్ఘకాలికంగా వేధిస్తున్నటువంటి కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుతుంది. స్వల్ప ధన లాభం గోచరిస్తున్నది.
ధనున్సు – చేపట్టిన కార్యక్రమాలు సాఫీగా పూర్తి చేస్తారు. ఇంటా బయట మీదే పై చేయిగా ఉంటుంది. ఫోన్ సంభాషణలు అధికంగా సాగిస్తారు. ఆరోగ్యాన్ని కొంత అశ్రద్ధ చేస్తారు.
మకరం – కార్యాలయాలలో అధికంగా శ్రమిస్తారు. మనలో తప్పు లేకపోతే ఎవరికీ తలవంచనవసరం ఉండదని భావిస్తారు. వ్యాపార పరంగా చెప్పుకోదగిన లాభాలు కానీ నష్టాలు కానీ ఉండవు.
కుంభం – దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు. కొత్త మిత్రుల పరిచయాలు పెరుగుతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. అందరిలోనూ ప్రత్యేక గుర్తింపు పొందుతారు.
మీనం – కుటుంబ పరిస్థితులపై దీర్ఘాలోచనలు సాగిస్తారు. ఆర్థికంగా సర్దుబాట్లు చేయవలసి రావడం శక్తికి మించిన పని అవుతుంది. మానసిక ప్రశాంతతకు ఆధ్యాత్మికతే మేలైన మార్గమని భావిస్తారు.