మేషం – వ్యాపారాలను విస్తరిస్తారు. దైవ చింతన కలిగి ఉంటారు. ఆరోగ్యం పరంగా జాగ్రత్తలు అవసరం. అనుకోని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం.
వృషభం – ఆత్మీయులకు కీలక సమయంలో ఆర్థిక సహాయాన్ని అందిస్తారు.అనుకున్న పనులలో జాప్యం ఏర్పడుతుంది. అనుకొని అతిధుల నుండి శుభవార్తలు అందుకుంటారు. మానసిక ఆనందం కలుగుతుంది.
మిథునం – ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరిగిన సమర్థవంతంగా నిర్వహిస్తారు. వృత్తి- వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. బంధుమిత్రులతో సంబంధ బాంధవ్యాలు మరింత బలపడతాయి.
కర్కాటకం – పనులు నిదానంగా పూర్తవుతాయి. ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. కుటుంబంలో స్వల్పమైన అనారోగ్య సమస్యలు చోటుచేసుకుంటాయి.నూతన కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురై చికాకు పెడతాయి.
సింహం – బరువు బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు. మనోధైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది.
కన్య – ఆర్థిక ప్రణాళికలను క్రమపద్ధతిలో రూపొందించుకోగలుగుతారు. విదేశీయత్నాలు కలిసి వస్తాయి. శుభకార్యాలకు గాను ఆహ్వానాలు అందుకుంటారు.
తుల – ఎందుకో ఏమిటో తెలియని విధంగా ఎదుటివారు మీ మీద విమర్శల వర్షం కురిపిస్తారు పలుకుబడి ధనాన్ని ఉపయోగించి కొన్ని సమస్యలను రూపుమాపుకుంటారు.
వృశ్చికం – ప్రజా జీవితంలో మీ స్థాయి మరింతగా పెరుగుతుంది. ఎవరు ఏ సహాయం అడిగినా కాదు అనకుండా సహకరిస్తారు ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది విజయాలు కార్యరూపంలో కనిపించిన అసహనంగా ఉంటారు.
ధనుస్సు – మొండిగా వ్యవహరిస్తారు. కాంట్రాక్టులు దక్కుతాయి. ఇంట్లో శుభకార్యాల విషయమై కొద్దిపాటి వాదులాట జరిగే సూచన జాగ్రత్త వహించండి సామాజికపరమైన సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
మకరం – సంతాన పురోభివృద్ధి మానసిక ప్రశాంతతకు కారణం అవుతుంది రచన వ్యాసంగాల పట్ల మక్కువ చూపుతారు. నూతన గృహం కొనుగోలు యత్నాలు ప్రారంభిస్తారు.ప్రతి విషయంలో చురుగ్గా వ్యవహరిస్తారు.
కుంభం – ప్రజ్ఞా పాటవాలను కనబరిచి పనులను సానుకూలపరుచుకుంటారు. పరపతి కలిగిన వారితోటి కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి- ఉద్యోగాలపరంగా అధిక శ్రద్దను కనబరుస్తారు.
మీనం – అనుకూలమైన అధికార పత్రం ద్వారా ప్రత్యక్షంగా లాభపడతారు చిన్నచిన్న ప్రయోజనాలతో సంతృప్తిని వ్యక్తం చేయరు ప్రజా సంబంధాలను విస్తృత పరుచుకుంటారు.