Sunday, December 22, 2024

శుక్రవారం రాశి ఫలాలు(30-08-2024)

- Advertisement -
- Advertisement -

మేషం – నూతన ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. విందు వినోదాలు. దూరప్రాంతాల నుండి శుభ ఆహ్వానాలు అందుకుంటారు. భాగస్వామి వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు.

వృషభం – ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు.  ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. చిన్నచిన్న రుణాలు తీర్చి వేస్తారు.

మిథునం – ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబంలోని వారి ఆరోగ్య విషయమై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. మీ కష్టానికి తగిన ఫలితం కొన్ని సందర్భాలలో లభిస్తుంది.

కర్కాటకం – శుభకార్యాల విషయమై కార్యానుకూలత కోసం గట్టిగా ప్రయత్నిస్తారు. మంచి ఫలితాలు వస్తాయి. శుభకార్యాలు నిశ్చయమవుతాయి.మానసిక ఆనందం కలుగుతుంది.

సింహం – ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారు మిత్రులతో కలిసి నూతన వ్యాపారం ప్రారంభించాలను కుంటారు దానికి అనుగుణంగా అడుగులు వేస్తారు. అపవాదులను తొలగించుకునే ప్రయత్నాలు చేస్తారు.

కన్య – మీ ఆలోచనలు సరైన దారిలో ఉండడం వల్ల మేలైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. జీవిత భాగస్వామితో స్వల్ప విభేదాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. అనవసర వివాదాలకు దూరంగా ఉండండి.

తుల – అవసరాలకు తగిన ధనం చేతికి అందుతుంది. పుణ్యక్షేత్రాల సందర్శన మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది.ప్రతి విషయాన్ని దూరదృష్టితో పరిశీలిస్తారు.కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.

వృశ్చికం – నూతన వ్యక్తులతో పరిచయం మిత్రత్వానికి దారితీస్తుంది. ఉన్నతాధికారుల మెప్పును పొందగలుగుతారు. మిత్రులతో కలిసి విందు వినోదాల్లో చురుకుగా పాల్గొంటారు.

ధనుస్సు – ఎదుటి వారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోగలుగుతారు. మీ హోదాను పెంచే విధంగా మీ సంతానం అభివృద్ధి పథంలో పయనిస్తారు. మొండి ధైర్యంతో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను  తీసుకోగలుగుతారు.

మకరం – ప్రజా సంబంధాలు మరింత వృద్ధి చేసుకోగలుగుతారు. దానికి గాను కొంత ధనాన్ని అధికంగా ఖర్చు చేస్తారు. మిత్ర వర్గంలోనే ఒకరితో మాట పట్టింపులు వచ్చే సూచనలు ఉన్నాయి.

కుంభం – కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు సానుకూల పడతాయి. సంఘంలో  మీ మాటకు విలువ పెరుగుతుంది.

మీనం – మనసుకు తోచిందే చేయడం తప్ప ఇతరుల మాటలు లెక్కచేయరు. ఆదాయ వ్యయాలు సరి సమానంగా ఉంటాయి. సామాజిక  సేవా సంస్థలను,వృద్ధాశ్రమాలను సందర్శిస్తారు.

Saturday rasi phalalu

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News