Thursday, January 9, 2025

శనివారం రాశి ఫలాలు(30-11-2024)

- Advertisement -
- Advertisement -

మేషం – మూడో మనిషి ప్రమేయానికి తావివ్వరు. ఆర్థిక  పరిధులను విస్తృతపరచుకోవడానికి గాను మీరు చేసే యత్నాలు పురోగమనంలో ఉంటాయి. సన్నిహితుల సహాయ సహకారాలతో ఇంటి యందు శుభకార్యం నిర్వహిస్తారు.

వృషభం – వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభం పొందుతారు. గతంలోని లోపాలు కొన్ని వెలుగు చూస్తాయి. అనుకూల ఫలితాలు అధికంగా ఉండటం వలన చెప్పుకోదగిన ఇబ్బందులు ఏర్పడవు.

మిథునం – రెన్యువల్స్ పట్ల అప్రమత్తత వహించండి. ఎగుమతి దిగుమతి వ్యాపారస్తులు ఫైనాన్స్ రంగంలోని వారు తొందరపడకుండా నిదానంగా వ్యవహరించడం మంచిది.

కర్కాటకం – ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అవసరాలకు ధనం చేతికి అందుతుంది. బంధువులను కలిసి యోగక్షేమాలు ఆరా తీస్తారు.

సింహం – పుణ్యక్షేత్రాల సందర్శన మీ మానసిక ఉల్లాసానికి కారణం అవుతుంది. అనుకున్న విధంగా అవసరాలకు డబ్బు చేతికంది వస్తుంది. నూతన వస్తువులను వస్త్రాలను ఆభరణాలను కొనుగోలు చేస్తారు.

కన్య – ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. సెల్ఫ్ డ్రైవింగ్ పట్ల ఖచ్చితమైన జాగ్రత్తలు అవసరం. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.

తుల – అప్రయత్న కార్యసిద్ధి పొందుతారు. కార్యాలయంలో మీ స్థాయి పెరుగుతుంది. మీ సలహాలు సూచనలు కోరుతూ ఇతరులు మిమ్మల్ని ఆశ్రయిస్తారు. ధన వ్యయం అధికంగా ఉంటుంది.

వృశ్చికం – ప్రతి విషయాన్ని సూక్ష్మదృష్టితో పరిశీలిస్తారు. సంతానం పట్ల అధిక శ్రద్ధను కనబరుస్తారు. బాకీలు స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు సానుకూల దిశలో ఉంటాయి.

ధనుస్సు – వృత్తి ఉద్యోగాలపరంగా అమితంగా శ్రమిస్తారు. చాలా విషయాలలో మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. వివాహాది శుభకార్యాలు నిర్విఘ్నంగా పూర్తి చేయడానికి పూనుకుంటారు.

మకరం – చాలా విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. పెట్టుబడుల పైన ప్రధానంగా దృష్టిని సారిస్తారు. ఆర్థికపరమైన అంశాలలో చాలా మెలకువగా వ్యవహరిస్తారు.

కుంభం – వృత్తి ఉద్యోగాలలో ఏర్పడిన ఆటంకాలు తొలుగుతాయి. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. ఒకప్పటి రాజకీయ మిత్రులతో తిరిగి సఖ్యత ఏర్పడుతుంది. శుభ సమాచారాన్ని అందుకోగలుగుతారు.

మీనం – అధిక ధన వ్యయాన్ని లెక్కబెట్టరు మనసును ప్రశాంతంగా ఉంచుకోగలుగుతారు చురుకుగా ఉత్సాహంగా ఉంటారు శుభకార్యాలలో పాలుపంచుకుంటారు.

Saturday rasi phalalu

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News