Friday, January 31, 2025

శుక్రవారం రాశి ఫలాలు(31-01-2025)

- Advertisement -
- Advertisement -

మేషం – ఉన్నతికి ఉపకరించే ప్రతి అంశం పట్ల జాగ్రత్త వహిస్తారు. ఆర్థిక పురోభివృద్ధిని కొంతవరకైనా సాధించగలుగుతారు. వాయిదా పద్ధతులలో స్థిరాస్తులను కొనుగోలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి.

వృషభం –  తొందరపాటుతనం అహంభావ ధోరణిని విడిచిపెడితే మరిన్ని మంచి ఫలితాలను అందుకోగలుగు తారు. జీవిత భాగస్వామితో సలహాలను సంప్రదింపులను సాగిస్తారు. ఆర్థిక సమస్యలు చికాకు కలిగిస్తాయి.

మిథునం – సకాలంలో అనుకున్న విధంగా పనులను పూర్తి చేయగలుగుతారు ఆర్థికపరమైన చిక్కుల నుండి పూర్తిగా కాకపోయినా ఒత్తిడి నుండి బయట పడతారు.  విద్యార్థినీ విద్యార్థులు కష్టపడి చదవాల్సిన తరుణం.

కర్కాటకం – ఆత్మవిశ్వాసం మనోధర్యం పెరుగుతాయి. ఆయాచితంగా కొన్ని శుభ ఫలితాలు చేకూరుతాయి.  పెట్టుబడులు స్థిరాస్తుల వ్యవహారాలు క్రమబద్ధీలో ఉంటాయి. పెద్దలు వృద్ధుల పట్ల మీ బాధ్యతలను నెరవేర్చు కోగలుగుతారు.

సింహం – నూతన అవకాశాలు కలిసి వస్తాయి. మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి- ఉద్యోగాలపరంగా శ్రమ అధికంగా ఉండే వర్గాలకు మిమ్మల్ని బదిలీ చేసే సూచనలు ఉన్నాయి.

కన్య – వృత్తిలో పురోగతి సాధిస్తారు. ఇంటా బయటకు విలువ అనేది పెరుగుతుంది. సకాలంలో నిర్వహించే కరస్పాండెన్స్ వలన లాభపడతారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం లభిస్తుంది.

తుల – ఒకే సమయంలో అనేక కార్యక్రమాలను సానుకూల పరుచుకోవాల్సి రావడం ఒత్తిడికి గురిచేస్తుంది. ఆర్థికపరమైన అంశాలు ఏ దారిన పోతున్నాయో ఊహించడం మీకు కష్ట సాధ్యంగా పరిణమిస్తుంది.

వృశ్చికం – మీ స్థాయి పరపతి పెంపొందుతాయి ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది అన్నింట అనుకూలంగా ఉంటుంది ఎలర్జీ వంటి ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది.

ధనుస్సు – మనీ రొటేషన్ స్కీమ్స్ లో సభ్యత్వాన్ని తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.  సంస్థపరంగా తీసుకునే నిర్ణయాలలో తొందరపాటు తగదు. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది.

మకరం –  కుటుంబంలో ఒకరికి నూతన ఆదాయ మార్గం లభించే సూచన. విదేశాల నుండి విలువైన సమాచారాన్ని అందుకుంటారు. వ్యాపార విస్తరణ గాను మీరు చేసే కృషి ఫలిస్తుంది.

కుంభం –  కుటుంబ ఖర్చులు వ్యక్తిగతమైన ఖర్చులు ఎక్కువ అవుతాయి. పెద్దలకు సంబంధించిన సెంటిమెంట్ వ్యవహారాలలో ఏ లోటు లేకుండా విధివిధానంగా నిర్వహిస్తారు.

మీనం – అభివృద్ధికి తగిన విధంగా గృహం లేక స్థలాన్ని కొనుగోలు చేస్తారు. చెల్లింపులను సకాలంలో చెల్లించ గలుగుతారు. సంతానానికి సంబంధించిన విషయాలలో బంధువుల సహాయ సహకారాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News