Sunday, December 22, 2024

శనివారం రాశి ఫలాలు(31-08-2024)

- Advertisement -
- Advertisement -

మేషం – వృధా ఖర్చులు అధికమవుతాయి. విందు వినోదాలలో పాల్గొంటారు విహారయాత్రలు చేస్తారు. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటారు.

వృషభం – ఉద్యోగాలలో పురోగతి ఉన్న ఏదో అసంతృప్తి వెన్నాడుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చాలా అవసరం. సంతానం వైద్య విద్యలలోను రాణిస్తారు.

మిథునం – ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు. తల్లితండ్రులను ప్రేమగా చూసుకుంటారు. శుభ సమాచారాన్ని అందుకుంటారు. ఉద్యోగంలో ఇంక్రిమెంట్లు పొందుతారు.

కర్కాటకం – ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. శత్రు బాధలు కొంత ఇబ్బంది పెడతాయి. వ్యాపార సంబంధమైన విషయాలు బాగున్నాయి.

సింహం – ఆర్థిక వ్యవహారాలలో అభివృద్ధి సాధిస్తారు. రుణ బాధల నుండి బయటపడతారు. వ్యాపారాలలో కొన్ని నిర్ణయాలు మీకు అనుకూలంగా వస్తాయి. ప్రశాంతమైన ఆలోచనలతో రోజు గడుస్తుంది.

కన్య – ఫలితాలు మీరు ఆశించిన స్థాయిలో కాకపోయినా కొంతవరకు మెరుగ్గానే ఉంటాయి. బంధువర్గంతో మాట పట్టింపులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. వృత్తి ఉద్యోగాలపరంగా అధిక శ్రద్ధను కనబరుస్తారు.

తుల – ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ పట్టుదల మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మీ మీ రంగాల్లో సందర్భానుసారంగా ముందుకు సాగితే శుభ ఫలితాలు అందుకోగలుగుతారు.

వృశ్చికం – ప్రయాణాలకు అనువైన సమయం కాదు.మిత్రులతో శుభకార్యాల విషయమైనా చర్చలు సాగిస్తారు పార్ట్ టైం జాబ్ వర్కులు లాభిస్తాయి. ప్రారంభించిన కార్యక్రమాల్లో విజయసిద్ధి గోచరిస్తుంది.

ధనుస్సు – మీపై పెత్తనం చెలాయించాలనుకున్న వారికి చేదు అనుభవాలు ఎదురవుతాయి. ఏ పని చేపట్టిన విజయవంతంగా పూర్తి చేస్తారు. శుభవార్తలకు సంబంధించిన తీపి కబురు ఆనందం కలిగిస్తుంది.

మకరం – అనుకున్న పనులు కొంత జాప్యం మీద పూర్తి చేస్తారు. నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. తొందరపాటుకు ఏమాత్రం అవకాశం కల్పించరు. లౌక్యంగా వ్యవహరిస్తారు. ధన లాభం.

కుంభం –  యత్న కార్యసిద్ది పొందుతారు.సువర్ణాభరణాలను కొనుగోలు చేస్తారు.శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. పుస్తక పఠనం పట్ల ఆసక్తిని కలిగి ఉంటారు.

మీనం – స్థిరాస్థి విషయంలో ఏర్పడిన విభేదాలు తొలగిపోయి సానుకూలత ఏర్పడుతుంది. వ్యాపార అభివృద్ధి ఆశాజనకంగా ఉంటుంది. చిన్నపాటి ఒడిదుడుకులు ఏర్పడినప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు.

Saturday rasi phalalu

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News