Sunday, January 19, 2025

ఆదివారం రాశి ఫలాలు(29-10-2023)

- Advertisement -
- Advertisement -

మేషం :- సంతానం పరంగా ఉన్నతి సాదిస్తారు. వారు తలపెట్టిన నూతన ప్రయత్నాలు చకచక ముందుకు సాగుతాయి. మిత్రులతొ మొండి వాదనలకు పట్టుదలకు పోవద్దు, అదే మీవ్యక్తిత్వాని దెబ్బ తీస్తుంది. దూరప్రయాణాలు లాభిస్తాయి. వాహనయోగంఉన్నది.

వృషభం :- వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండండి.పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. వృత్తి-వ్యాపారాలలో అభివృద్ధి కానవస్తుంది. మిత్రుల నుండి విలువైన కీలక సమాచారం అందుతుంది. ఆరోగ్య పరంగా స్వల్ప జాగ్రత్తలు అవసరం.

మిధునం :- కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుకొంటారు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఋణాలు కొంత వరకు తీరుస్తారు. ఆరోగ్య సమన్యలు ఎదురై చికాకులు పెడతాయి. శ్రద్ధ వహించండి. పనులు నిదానంగా  పూర్తవుతాయి.

కర్కాటకం :- పిల్లల భవిష్యత్తు కోసం చేయని యాగి ఉండదు. నూతన మిత్రులు పరిచయమై కొత్త పనులకు శ్రీకారం చుడతారు. కుటుంబ సభ్యులను కలిసిఆనందంగా గడుపుతారు.దూర ప్రాంతాల నుండి శుభవార్తలు వింటారు.

సింహం :- బంధువుల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. గృహనిర్మాణ యత్నాలు కలిసి వస్తాయి.మిత్రుల నుండి విలువైనకాంట్రాక్టులకు సంబందించిన సమాచారంతెలుసుకుంటారు. పెట్టుబడులకు తగిన లాభాలు లేవని నిరుత్సాహానికి లోనవుతారు.

కన్య:- వృత్తి-వ్యాపారాలలో ఎదురైన ఆటంకాలు తొలిగి వ్యాపార వృద్ది చెందుతుంది. మానసిక  ప్రశాంతత పొందుతారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి.సంతానానికి సంబందించిన విద్యా యోగ్యతలు, నడవడికలు తెలుసుకుని దారిన పెట్టె ప్రయత్నాలు చేస్తారు.

తుల :- ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆరోగ్యం పట్ల మెలుకువ అవసరం. వృత్తి-వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. అనుకోని విధంగా ఒకరి నుండి ముఖ్యమైన విషయాలు సేకరిస్తారు.

వృశ్చికం :- ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. వాహనయోగం గోచరిస్తున్నది.చిన్ననాటి మిత్రులకలయిక మీలోని ఉత్తేజాన్ని పెంచుతుంది. క్రయవిక్రయాలలో లాభాలు అంతంత మాత్రంగా ఉంటాయి.

ధనుస్సు:- కుటుంబ సభ్యుల నుండి సహాయసహకారాలు అందుతాయి. ప్రయాణాలు లాభిస్తాయి.పెట్టుబడులకు తగిన లాభాలు ఉండవు.పనులునిదానంగా పూర్తి చేస్తారు. దూరప్రాంతాల నుండి చెదు వార్తని వింటారు.

మకరం :- ఋణ బాధలు తొలుగుతాయి. పూర్వపు మిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. కీలక నిర్ణయాలలోజీవిత భాగస్వామి సలహాలు తీసుకొంటారు. క్రయవిక్రయాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. కుటుంబంలో చిన్నపాటి అలకలు ఉంటాయి.

కుంభం :- ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.వృత్తి-వ్యాపారాలు అభివృద్ధి కోసం సన్నిహితులతో చర్చిస్తారు. పనులలో ఎదురైన ఆటంకాలు తొలుగుతాయి. పిల్లలతో, కుటుంబసభ్యులతో సమయం గడుపుతారు. ఆకస్మికప్రయాణాలు అంత మంచిది కాదు.

మీనం:- చేపట్టిన వ్యవహారాలలో కొంత వరకు విజయం సాధిస్తారు. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి ప్రణాళికలు రూపొందించుకుంటారు. విలువైన వస్తు,ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అవసరానికి ధనం చేతికి అందుతుంది.

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News