Sunday, January 19, 2025

సోమవారం రాశి ఫలాలు(02-10-2023)

- Advertisement -
- Advertisement -

మేషం :- వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ఆకస్మిక ధనలాభం పొందుతారు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. గృహనిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. నూతన వస్తు వస్త్రాలు కొనుగోలుచేస్తారు.

వృషభం:- కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. కొత్త మిత్రులు పరిచయమై సాయం అందిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. సోదరుల నుండి ధనలాభం.

మిథునం:- రుణాలను కొంతవరకు తీరుస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వివాదాలకు, కోప, తాపాలకు దూరంగా వుండండి. ఉద్యోగ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి.

కర్కాటకం :- శ్రమ అధికం. పనులలో జాప్యం పెరిగిన చివరికి పూర్తి చేస్తారు. ప్రయాణాలలో తొందరపాటు వద్దు. ఆకస్మిక బదిలీల విషయాలు సేకరిస్తారు. కుటుంబ నభ్యుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు.

సింహం:- నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి-వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది. భూవివాదాలు తీరి నూతన ఒప్పందాలకు దారి తీస్తాయి.

కన్య:- సోదరులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకొంటారు. వృత్తి-వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైన చికాకులు పెట్టిన అధిగమిస్తారు. అనుకోని అతిథుల నుండి కీలక సమాచారం అందుకొంటారు. ధనలాభం.

తుల:- నూతన మిత్రులు పరిచయమై కొత్త పనులకు శ్రీకారం చుడతారు. వాహన, భూయోగాలు పొందుతారు. ఉద్యోగులు భవిష్యత్తు కొరకు పునరాలోచన చేస్తారు. వృత్తి-వ్యాపారాలలో లాభాలు పొందుతారు. శుభవార్తలు.

వృశ్చికం :- దూర ప్రయాణాలు లాభిస్తాయి. మిత్రులను కలిసి కష్టసుఖాలు పంచుకుంటారు. పనులు నెమ్మదిగా సాగుతాయి. బాధ్యతలు పెరిగినా సమర్ధవంతంగా  నిర్వహిస్తారు. క్రయ విక్రయాలలో స్వల్ప లాభాలు ఆర్జిస్తారు.

ధనుస్సు :- పాత మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి-వ్యాపారాలలో లాభాలు పొందుతారు. దూర ప్రాంతాల నుండి విలువైన సమాచారం అందుకొంటారు. కాంట్రాక్టులు లాభిస్తాయి. ప్రముఖుల కలయిక నూతనోత్తేజం కలిగిస్తుంది.

మకరం :- సంతానం నూతన ఉద్యోగవకాశాలు పొందుతారు. వారి ప్రతిభని కొనియడతారు. భాగస్వామ్య వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. విద్యా, వివాహ యత్నాలు అనుకూలిస్తాయి. భూవివాద యోగాలు పొందుతారు.

కుంభం :- ప్రయాణాలలో తొందరపాటు వద్దు. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి. మిత్రుల నుండి కీలక సమాచారం అందుతుంది. విలువైన వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. ఆకస్మిక ధనలాభం.

మీనం:- ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఎదురైన అధిగమిస్తారు. బంధువుల నుండి విలువైన సమాచారం అందుకొంటారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఆహ్వానాలు అందుకుంటారు. సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు.

సోమేశ్వరశర్మ : 8466932223,9014126121

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News