Friday, December 27, 2024

సోమవారం రాశి ఫలాలు(03-06-2024)

- Advertisement -
- Advertisement -

మేషం – వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. దూరప్రాంతాల నుండి కీలక సమాచారం అందుకుంటారు. అనుకొని అవకాశాలు లభిస్తాయి. సన్నిహితులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు.

వృషభం – ఆలోచనలు అధికమవడం వత్తిడి మొదలైన కారణాల వలన మానసిక సౌఖ్యం లోపిస్తుంది. ఆర్థికపరమైన లోటుపాట్లను తీర్చుకోవడానికి అధికంగా శ్రమించవలసి వస్తుంది.

 మిథునం –  ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. క్రయవిక్రయాలలో స్వల్పమైన లాభాలను అందుకోగలరు. కుటుంబ విషయంలో పురోగతికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి.

కర్కాటకం – పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా జరుగుతాయి. కొత్త రుణాలు చేస్తారు. నూతన ఉద్యోగ అవకాశాలను అన్వేషించడంలో సఫలం అవగలుగుతారు.

సింహం – వ్యాపార వ్యవహారాలు సున్నితమైన అంశాలతో ముడిపడి ఉంటాయి. దూరప్రాంత ప్రయాణాలు తాలూకు తేదీలను ఖరారు చేసుకుంటారు ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది.

కన్య –  ఆరోగ్యం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు అవసరం.  దూరప్రాంత విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి.

తుల – ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. శ్రమ అధికంగా ఉంటుంది. రుణ బాధలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. పనులలో ఆటంకాలు ఎదురైనా సకాలంలో పూర్తి చేస్తారు.

వృశ్చికం – వృత్తి వ్యాపారాలలో శ్రమ పెరగకుండా ముందుచూపుతో వ్యవహరిస్తారు. ఆరోగ్య విషయంలో వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్త అవసరం. సమస్యలు పరిష్కారం అవుతాయి.

ధనుస్సు-  పనులు నిదానంగా పూర్తి చేస్తారు. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండటం మంచిది. గోప్యతకు ఎక్కువగా ప్రాధాన్యతని ఇస్తారు. నూతన మిత్రుల పరిచయాలు పెరుగుతాయి.

మకరం – క్రయవిక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి సకాలంలో పూర్తి చేస్తారు. బంధువుల నుండి శుభవార్తలు అందుకుంటారు.

కుంభం – పరపతి పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. స్థిరాస్తి కొనుగోలు చేసే విషయంలో జాగ్రత్తలు అవసరం. దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు.

మీనం – అభివృద్ధి కార్యక్రమాలకు గాను రుణాలు మంజూరు అవుతాయి. మొండి సమస్యలు తీరిపోతాయి.  వ్యాపారంలో రొటేషన్ సంతృప్తికరంగానే ఉంటుంది. లాభాలు గతంలో కంటే బాగుంటాయి.

Saturday rasi phalalu

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News