మేషం :- ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రగా వుంటుంది. చేపట్టిన పనులు సన్నిహితుల సాయంతో పూర్తి చేస్తారు. ఆరోగ్యం, వాహనాల విషయాలలో నిర్లక్ష్యం తగదు. సోదరుల నుండి ధనలాభం.
వృషభం:- కుటుంబ సభ్యులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. వివాదాలకు దూరంగా వుండండి. ప్రయాణాలు లాభిస్తాయి. కాంట్రాక్టులు లాభిస్తాయి. శుభవార్తలు అందుకుంటారు.
మిధునం :- ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రగా వుంటుంది. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సోదరుల నుండి కీలక సమాచారం అందుకొంటారు. నూతన వస్తువు కొనుగోలు చేస్తారు.
కర్కాటకం :- కుటుంబ సభ్యుల నుండి సహాయ నహకారాలు అందుతాయి. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. అనుకోని అవకాశాలు అందుకుంటారు. వాహన యోగం ఉన్నది.
సింహం :- రుణ ఒత్తిడుల నుండి బయటపడతారు. మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకంటారు. దూర ప్రాంతాల నుండి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. కాంట్రాక్టులు లాభిస్తాయి.
కన్య :- వృత్తి-వ్యాపారాలు విస్తరిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. అనుకోని ప్రయాణాలు లాభిస్తాయి. క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. నూతన వస్తు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు.
తుల:- ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా వుంటాయి. నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త వల్ల ఆనందం కలుగుతుంది. పనులు పూర్తి చేస్తారు. సంతానంనకు ఉన్నత విద్యావకాశాలు.
వృశ్చికం :- కుటుంబ నభ్యులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. దూర ప్రయాణాలు లాభిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. సంగీత సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు.
ధనుస్సు:- విందు, వినోదాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో ప్రోత్సాహం. నూతన వస్తు, వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.
మకరం :- ఋణాలు తీరుస్తారు. ఉద్యోగాలలో ఉన్నతహోదాలు పొందుతారు. పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం. సంఘంలో గౌరవం పొందుతారు. శుభ ఆహ్వానాలు అందుకుంటారు
కుంభం:- నూతన ఉద్యోగవకాశాలు పొందుతారు. ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొంటారు. ఆర్ధికపరమైన ఇబ్బందులు అంతగా ఉండవు.
మీనం :- కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వాహన సౌఖ్యం. దీర్ఘకాలిక నమస్యలు తీరి ఊరట చెందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. శుభవార్తలు వింటారు.
సోమేశ్వరశర్మ : 8466932223,9014126121