Monday, December 23, 2024

శుక్రవారం రాశి ఫలాలు(03-11-2023)

- Advertisement -
- Advertisement -

మేషం – ధనమే అన్నింటికీ మూలమని నిరూపించే విధంగా సంఘటనలు మీ అనుభవంలోకి వస్తాయి. చిరపరచితుల ద్వారా ఉపయుక్తమైన సమాచారాన్ని తెలుసుకుంటారు.

వృషభం – లౌక్యంగా వ్యవహరించి ప్రతిపనిలోనూ ఎంతోకొంత వృద్ధిని సాధించగలుగుతారు. మీ వ్యక్తిగత రహస్యాలను బయటకు వెళ్ళడి చేసే వ్యక్తుల వషయంలో తగు జాగ్రత్తలు వహించవలసి ఉంటుంది.

మిథునం – కోర్టుకు సంబంధించిన కేసులను నూతన న్యాయవాదికి బదిలీ చేస్తారు. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. స్వయంకృతాపరాధాలు చేయకుండా జాగ్రత్తలు పాటించండి.

కర్కాటకం – సంతానం కీర్తి ప్రతిష్టలను పెంపొందించే విధంగా నడచుకోవడం మీకెంతో సంతృప్తిని నిస్తుంది. ప్రత్యేకమైన కారణాలేవీ లేకపోయినా వేళకు ఆహారం తీనుకోరు. అదే మీకు పెద్ద ఇబ్బంది కలుగ చేస్తుంది. నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు.

సింహం – నిత్యావసర వన్తువుల కొనుగోళ్లు చేస్తారు. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. పెద్దల సహాయ సహకారాలను అందుకుంటారు. దైవ చింతన కలిగి ఉంటారు.

కన్య – ఎలక్ష్రానిక్‌ మీడియా రంగంలోని ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. నూతన వ్యాపారాలకు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. స్వల్ప ధనలాభ నూచన.

తుల – ఉద్యోగస్తులు కార్యాలయంలో తమ నూతన బాధ్యతలను సక్రమంగా నిర్వహించ గలుగుతారు. లౌక్యంగా వ్యవహరించి ప్రతిపనిలోనూ ఎంతోకొంత వృద్ధిని సాధించ గలుగుతారు.

వృశ్చికం – . చెల్లించ వలసిన చెల్లింపులకు గాను వత్తిడి అధికంగా ఉంటుంది.ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. ఆలోచించి ముఖ్యమైన విషయాలలో ఆచితూచి నిర్ణయాలను తీసుకుంటారు.

ధనున్సు – విద్యా, సాంస్కృతిక, వాణిజ్య రంగాల వారికి  ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగస్తులు విధి నిర్వహణను సక్రమంగా నిర్వహించగలుగుతారు. వ్యాపారంలో రొటేషన్స్‌ బాగున్నప్పటికీ లాభాలు అందని ద్రాక్షలా ఉంటుంది.

మకరం – ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మనోధైర్యం కలిగి ఉంటారు. క్రీడలలో విందు, వినోదాలు ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. మీకు రావాల్సిన ధనానికి గట్టి హామీ లభిస్తుంది.

కుంభం – నిర్మాణాత్మకమైన నిర్ణయాలను అమలు చేయడానికి తగిన వ్యక్తులు కలిసి వస్తారు. మీకు రావలసిన ధనానికి గాను గట్టి మధ్యవర్తిత్వం లభిస్తుంది. గ్రూప్‌ రాజకీయాలకు దూరంగా ఉండటం మంచిది.

మీనం – సుధీర్ఘంగా మొండి పడిన వ్యవహారాలు ఒక దారికి వస్తాయి. కుటుంబ బాధ్యతలకు ప్రాధాన్యతనిస్తారు. బంధువులు లేక ఆత్మీయులతో భేదాభిప్రాయాలు చోటు చేసుకుంటాయి. దైవ చింతనే దారి చూపుతుంది.

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News