మేషం – ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా వుండును. అనుకోని అతిథుల నుండి విలువైన సమాచారం అందుతుంది. వాహన సౌఖ్యం.శుభ వార్తలను వింటారు. పెట్టుబడులకు అనుకూలం.
వృషభం –ప్రయాణాలు లాభిస్తాయి. జీవితభాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. పనులు సాఫీగా సాగుతాయి. దూరప్రాంతాల నుండి శుభవార్తలు అందుకొంటారు. శుభ ఫలితాలను అందుకుంటారు.
మిథునం – ఆశించిన విధంగా ఫలితాలు వుండవు.మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకొంటారు. భూముల క్రయవిక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు. సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు.
కర్కాటకం –భూవివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. రెట్టించిన ఉత్సాహంతో ఉంటారు. సోదరులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. వస్తు లాభాలు.
సింహం –కృషి ఫలిస్తుంది.సానుకూలమైన ఫలితాలను పొందుతారు.చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మిత్రుల నుండి కీలక సమాచారం. అందుకొంటారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ధనలాభం.
కన్య –బంధువులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకొంటారు. ముఖ్యమైన పనులో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ఊహించిన ఫలితాలు అందకపొవచ్చు .
తుల –దూరప్రాంతాల నుండి కీలక సమాచారం అందుకొంటారు.అన్నింటా మీదే విజయం అనేల పరిస్థితులు ఉంటాయి. కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. సోదరుల నుండి ధన, వస్తు లాభాలు పొందుతారు.
వృశ్చికం –వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. జీవిత భాగస్వామి నుండి సహాయ సహకారాలు అందుతాయి. బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. క్రయవిక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు.
ధనున్సు –ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి, వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి. సంతానం చేసే నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.
మకరం – అనుకున్న దానికన్నా ఎక్కువ ఫలితాలు పొందుతారు. రుణాలు తీరుస్తారు. మానసిక ప్రశాంతత పొందుతారు. సోదరుల నుండి వచ్చిన సమాచారం ఆనందం కలిగిస్తుంది . వృత్తి, వ్యాపారాలు లాభిస్తాయి. విందు, వినోదాలు. నూతన వస్తు, వస్త్రా కొనుగోలు చేస్తారు.
కుంభం – ఫలితాలు మీరు అనుకున్న విధంగా వస్తాయి. ముఖ్యమైన పనులలో జాప్యం జరిగిన సన్నిహితుల సాయంతో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వున్న అవసరాలకు డబ్బు అందుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. వస్తు లాభాలు.
మీనం –ఊహించిన ఫలితాలు తారుమారు అవుతాయి. కొంత నిరాశ ఏర్పడుతుంది.చేపట్టిన కార్యక్రమాలలో ఎదురైన ఆటంకాలు తొలుగుతాయి. తగాదాలకు దూరంగా వుండండి. సోదరుల నుండి ఆస్తి లాభం పొందుతారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్
9014126121, 8466932225