Thursday, December 19, 2024

మంగళవారం రాశి ఫలాలు(04-06-2024)

- Advertisement -
- Advertisement -

మేషం – ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. మిమ్మల్ని  సూటిపోటి మాటలతో గేలి చేసే వ్యక్తులు అధికమవుతారు. కొంతమంది మీపై లేని నిందలు మోపుతారు.

వృషభం – అనుకూలంగా వస్తాయనుకున్న ప్రతిఫలాలు మీకు ప్రతికూలంగా రావడం మానసిక ఒత్తిడికి కారణం అవుతాయి. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి.

మిథునం –  శుభవార్తలు అందుకుంటారు. మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది.సన్నిహితుల సహాయ సహకారాల వల్లనే ఇదంతా సాధించగలిగామని ఆత్మసంతృప్తి మిగులుతుంది.

కర్కాటకం – ఆరోగ్యం, వాహనాల విషయంలో మెలకువ అవసరం. సంతానం విద్యా విషయంలో నూతన బాధ్యతలు చేపడతారు. అందరితో కలిసి ఆనందంగా గడుపుతారు.ఖర్చుకు వెనకాడరు.

సింహం – ఊహించని ఫలితాలు ఎదురవుతాయి. కష్టానికి తగిన విజయాన్ని అందుకున్నాం అనే ధీమా మీలో కలుగుతుంది. సన్నిహిత వర్గానికి తగిన సహాయం అందిస్తారు.

కన్య – శుభవార్తలు శ్రవణం చేస్తారు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి మంచి ఫలితాలు ఉంటాయి. మీ సన్నిహిత వర్గం విజయం, మీ విజయంగా భావిస్తారు.అందరితో కలిసి ఆనందంగా గడుపుతారు.

తుల – మనం ఆశించిన ఫలితాలని అందుకోగలిగామనే మానసిక ధైర్యం కలిగి ఉంటారు. కొంతమంది చేసిన దుష్ప్రచారం మనల్ని ఏ విధంగా ఇబ్బంది కలిగించలేదని ఆనందిస్తారు.

వృశ్చికం – రాజకీయాల పట్ల ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తారు. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా నడుచుకుంటారు. ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. మేలు జరుగుతుంది.

ధనున్సు – ఉపయోగకరమైన శుభ ఫలితాలను అందుకుంటారు. మానసికంగా ఉల్లాసంగా గడుపుతారు ఆరోగ్యం బాగుంటుంది. మీ సంతానానికి విద్యా అవకాశాలు కలిసి రావడం మీకు సంతోషం కలిగిస్తుంది.

మకరం – ఊహించిన ఫలితాలు తారుమారవుతాయి.ఎక్కడ లోపం జరిగిందని ఆత్మ పరిశీలన చేసుకుంటారు. వచ్చిన అవకాశాన్ని సరిగా ఉపయోగించుకోలేకపోయామని వేదన కలుగుతుంది.

కుంభం – ముఖ్యమైన వ్యవహారాలపైన దృష్టి సారిస్తారు.వృత్తి- ఉద్యోగాలు అనుకూలిస్తాయి. మీరు ఆశించిన ఫలితాలు అంతంత మాత్రమే అందుతాయి. మనోబలంతో ముందడుగు వేస్తారు.

  మీనం –  రాజకీయ రంగంలో ఉన్నవారికి అనుకోని పదవులు అధిరోహించే సూచనలు గోచరిస్తున్నాయి. అప్రయత్న కార్యసిద్ధి పొందుతారు. దూరప్రాంతాల నుండి వచ్చిన ఆహ్వానాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి.

Saturday rasi phalalu

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News