Sunday, January 19, 2025

నేటి రాశి ఫలాలు.. ఫలితాలు…(04/09/2023)

- Advertisement -
- Advertisement -

మేషం: అందరిలోనూ ప్రత్యేకమైన గుర్తింపు పొందుతారు. ఊహించని వారితో కూడా మన్ననలు అందుకుంటారు. దూర ప్రాంతాల నుండి వచ్చే శుభవార్తలు ఆనందాన్ని కలుగజేస్తాయి. వాహన యోగం గోచరిస్తున్నది. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి.
వృషభం: విందు వినోదాలు,శుభకార్యాలలో చురుకుగా పొల్గొంటారు. బంధువుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. ఖర్చులు అధికమవుతాయి. నూతన వస్తువులు, వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు పరీక్షాకాలం.చదువుపై శద్ధ్ర
అవసరం.
మిథునం: శ్రమకు తగిన ప్రతిఫలం లభించదు కదా అభియోగాలు అధికమవుతాయి. పనులలో జాప్యం అయినా సజావుగా సాగుతాయి. వివాదాలకు దూరంగా ఉండండి. ఆర్థిక పరిస్థితి కొంత వరకు అనుకూలంగా ఉంటుంది. ఆందోళనలు అధికంగా ఉంటాయి.

కర్కాటకం: ఆదాయం కంటే ఖర్చులు అధికంగా పెరుగుతాయి. ఉద్యోగస్థులకు అదనపు బరువు బాధ్యతలు పెరిగినా బెదరకుండా సమర్థవంతంగా నిర్వహిస్తారు. కాని ఎంత శ్రమించినా ఫలితం శూన్యం. వస్తులాభాలు పొందుతారు.
సింహం: నూతన ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. మిత్రుల నుండి విలవైన సమాచారం అందుకుంటారు.మానసిక ఉల్లాసంతో ఉంటారు.
కన్య: బంధువులతో ఏర్పడిన ఆస్తి తగాదాలు పరిష్కరించుకుంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరము. దూరప్రాంత ప్రయాణాలలో తొందరపాటు నిర్ణయాలు చేయద్దు. ఆకస్మిక ధనలాభం పొందుతాయి.

తుల: నూతన మిత్రులతో పరిచయాలు పెరుగుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. తలపెట్టిన ముఖ్యమైన వ్యవహారాలో విజయం దిశగా సాగుతారు.ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది.
వృశ్చికం: ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. సహోదర వర్గం నుండి సహాయ సహకారాలు అందుకుంటారు. అనుకున్న పనులలో ఆటంకాలు వచ్చినా, సరిదిద్దుకుని నిదానంగా పూర్తి చేస్తారు. మీరు పడిన శ్రమ ఫలిస్తుంది.
ధనస్సు: వృత్తి- వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు. విలవైన వస్తువులు, వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వస్తు లాభాలు పొందుతారు. ఇంట్లో ఈగల మోత- బయట పల్లకీ మోత అన్నట్టు ఉంటుంది.
మకరం: జీవిత భాగస్వామి నుండి ఆర్థిక పరంగా లాభాలు పొందుతారు.వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి- వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. ఆకస్మిక ధనలాభాలు అందుకుంటారు. మంచి చేస్తే అంతా మంచే మనకుే దక్కతుందని తెలుసుకుంటారు.
కుంభం: మిత్రుల నుండి వ్యాపార పరమైన కీలక సమాచారం అందుకుంటారు. క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. చేపట్టిన ముఖ్య కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. కళా, రాజకీయ రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది.
మీనం: భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. చేపట్టిన కాంట్రాక్టులలో లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యులను, మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. ధనం ఖర్చయినా పెద్ద పట్టింపు లేనట్టుగా ఉంటారు.

సోమేశ్వర శర్మ : 8466932223,9014126121

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News