Thursday, December 26, 2024

బుధవారం రాశి ఫలాలు (04-10-2023)

- Advertisement -
- Advertisement -

మేషం :- ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వుంటుంది. శ్రమాధికంగా ఉంటుంది. పనులో తొందరపాటు నిర్ణయాలు వద్దు. జీవితభాగస్వామి నుండి ధన లాభం పొందుతారు. శుభవార్తలు వింటారు.

వృషభం :- కుటుంబ సమస్యల నుండి బయటపడతారు. దీర్ఘకాలిక ఋణాలు తీరి ఊరట చెందుతారు. అనుకోని సమస్యలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. సోదరుల నుండి శుభవార్తలు, ధనలాభం పొందుతారు.

మిథునం :- వృత్తి-వ్యాపారాలలో అనుకూలత పొందుతారు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ నభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఆకస్మిక ధన, వస్తు లాభాలు పొందుతారు. వాహనయోగం గోచరిస్తున్నది.

కర్కాటకం :- ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. విందు, వినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి.

సింహం :- ముఖ్యమైన పనులలో జాప్యం జరిగిన సన్నిహితుల సాయంతో పూర్తి చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు. సోదరుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. దానివలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది.

కన్య:- దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. పాత, కొత్త మిత్రుల పరిచయాలు పెరుగుతాయి. దూర ప్రాంతాల నుండి కీలక సమాచారం అందుకొంటారు. అనుకోని ఆహ్వానాలు ఆనందం కలిగిస్తుంది. ఆరోగ్య పరంగా జాగ్రత్తలు అవసరం.

తుల:- ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా వుంటుంది. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండండి. వృత్తి-వ్యాపారాలలో ఎదురైనా ఆటంకాలను అధిగమిస్తారు. కాంట్రాక్టులు దక్కుతాయి.

వృశ్చికం :- ఇంటి విషయాలపై శ్రద్ద చూపుతారు. సోదరులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. షేర్లు,  భూముల క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. అనుకోని అవకాశాలు లభిస్తాయి. వస్తు యోగం గోచరిస్తున్నది.

ధనుస్సు:- పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకొంటారు. వృత్తి-వ్యాపారాలలో ప్రోత్సాహంగా ఉంటుంది. సోదరసహోదరిల కలయిక ఉత్సాహం కలిగిస్తుంది.

మకరం :- ఋణ వత్తిడుల నుండి బయటపడతారు. ఆరోగ్య సమన్యలు ఎదురైనా అధిగమిస్తారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్ధికంగా అనుకూలత. కాంట్రాక్టులు దక్కుతాయి. నూతన వస్తు, వస్త్ర కొనుగోలు.

కుంభం :- సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. జీవితభాగస్వామితో మాటపట్టింపులు తలెత్తుతాయి.

మీనం :- పాత మిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. కళాసాంస్కృతిక , రాజకీయ రంగాల వారికి సన్మానాలు, సత్కారాలు పొందుతారు. ఆర్థిక లావాదేవీలు అభివృద్ధి చెందుతాయి. వాహన యోగం గోచరిస్తున్నది.

Saturday rasi phalalu

సోమేశ్వరశర్మ : 8466932223,9014126121

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News