Sunday, December 22, 2024

శనివారం రాశి ఫలాలు(04-11-2023)

- Advertisement -
- Advertisement -

మేషం – వ్యక్తిగత విషయాలకు ప్రాముఖ్యతనిస్తారు. కొనుగోలుకు అధికంగా ఖర్చు చేస్తారు. కుటుంబ అవసరాలను దృష్టిలో ఉంచుకొని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

వృషభం – సమీప బంధువులను కలుస్తారు. భవిష్య ప్రణాళికల గురించి చర్చించి, అధికంగా లాభం వచ్చే న్వల్పకాలిక వ్యాపారాలలో ధనాన్ని మదుపు చేస్తారు. స్పెక్యులేషన్‌ లాభసాటిగా ఉంటుంది.

మిథునం – వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యమైన సమస్యలు పరిష్కారమవుతాయి. జీవితభాగస్వామి సహాయ సహకారాలు అందుకుంటారు. సంఘసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

కర్కాటకం – అనుకూలమైన వాతావరణం నూతనోత్యాహాన్ని ఇస్తుంది. ఆర్థిక పరిస్థితిఅనుకూలంగా ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి.

సింహం – యోగాభ్యాసం ప్రకృతి వైద్యం ప్రత్యేకంగా ఆకర్షిస్తాయి. గృహ సంబంధిత ఖర్చులు అధికమవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో సొంత నిర్ణయాలకు ప్రాముఖ్యతనివ్వండి.

కన్య – కుటుంబంలో ఐకమత్యత మానసిక ప్రశాంతతను ఇస్తుంది. వ్యాపారంలో రొటేషన్‌ లాభాలు బాగుంటాయి. విలువైన వన్తువుల భద్రతపట్ల అప్రమత్తత వహించండి. వాహన యోగ నూచన.

తుల – ప్రజాసంబంధాలను బలపరచుకోవడానికి మరింత శ్రమిస్తారు. అనుకూల ఫలితాలను సాధిస్తారు. గతంలో చేజారిన అవకాశాలు ఇప్పుడు అందివస్తాయి. శుభకరంగా ఉంటుంది.

వృశ్చికం – క్రయ విక్రయాలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. ఆరోగ్య సూత్రాలు క్రమపద్ధతిలో అమలు పరచాలని నిర్ణయించుకుంటారు. వినోద కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు.

ధనున్సు – గృహోపకరణ సామాగ్రిని సమకూర్చుకుంటారు. బంధువులు శ్రేయోభిలాషులతో ఇష్టాగోష్టి సాగిస్తారు. అనుకూలమైన వాతావరణంలో ఆనందంగా కాలం గడుపుతారు.

మకరం – మానసిక ఒత్తిడి నుండి బయటపడతారు. సంతాన విద్యా విషయ వ్యవహారాల పట్ల ఎక్కువ ఆసక్తిని కనబరుస్తారు. శ్రమకు ఓర్చి కార్యక్రమాలను విజయపథంలో నడిపిస్తారు.

కుంభం – నూతన ప్రదేశాలను నందర్శిస్తారు. అన్ని విషయాలలో భద్రతకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని చెప్పదగిన. ముఖ్య బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించి మంచి పేరు ప్రఖ్యాతలు సాధిస్తారు.

మీనం – బంధువుల ద్వారా ధన, వస్తు లాభాలు పొందుతారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. క్రయ, విక్రయాలలో లాభాలు పొందుతారు.

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News