మేషం – ఎంత కష్టించినా ఫలితం కష్టమే. నూతన ప్రయత్నాలలో ఎదురైన ఆటంకాలు కొంత వరకు తొలుగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. కాంట్రాక్టులు లాభిస్తాయి. వస్తు లాభం.
వృషభం – ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వున్న అవసరాలకు డబ్బు అందుతుంది. జీవిత భాగస్వామి నుండి ధన, వస్తు లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. వాహన సౌఖ్యం.
మిథునం – గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. షేర్లు, భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. ప్రముఖుల కలయిక.
కర్కాటకం – బంధువులతో ఏర్పడిన విరోధాలు పరిష్కారమై ఊరట చెందుతారు. కుటుంబ సభ్యుల నుండి సహాయసహకారాలు అందిస్తారు. అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. వస్తు లాభం.
సింహం – నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంఘంలో ఆదరణ పొందుతారు. విలువైన వస్తు, వస్త్రా, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. దూరప్రాంతాల నుండి శుభవార్తలు అందుకొంటారు. వాహనసౌఖ్యం.
కన్య – కుటుంబ సమస్యలు ఎదురైన అధిగమిస్తారు. భూతగాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆహ్వానాలు.
తుల – ప్రయాణాలు లాభిస్తాయి. సన్నిహితులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. పెట్టుబడులకు తగిన లాభాలు.
వృశ్చికం – బంధువుల నుండి ముఖ్యమైన సమాచారం అందుకొంటారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్పలాభాలు పొందుతారు. దూరప్రాంతాల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆనందం కలుగుతుంది. కాంట్రాక్టులు దక్కుతాయి.
ధనున్సు – సోదరులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకొంటారు. శ్రమ అధికం. విలువైన వస్తు కొనుగోలు చేస్తారు. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.
మకరం – ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా వున్న అవసరాలకు డబ్బు అందుతుంది. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. రుణాలు తీరుతాయి. జీవిత భాగస్వామి నుండి ధన, వస్తు లాభాలు.
కుంభం – మిత్రుల నుండి కీలక సమాచారం అందుతుంది. విందు, వినోదాలు. శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. షేర్లు, భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. సాంకేతిక విద్యావకాశాలు.
మీనం – గృహ, వాహన యోగాలు పొందుతారు. సంగీత, సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సన్నిహితుల నుండి అతిముఖ్యమైన సమాచారం అందుతుంది. విందు, వినోదాలు.
సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్
9014126121, 8466932225