Monday, January 20, 2025

శుక్రవారం రాశి ఫలాలు(05-01-2024)

- Advertisement -
- Advertisement -

మేషం -ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఋణాలు తీరుస్తారు. మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. కొత్త పనులు చేపడతారు. దూరప్రాంతాల నుండి కీలక సమాచారం అందును.

వ్యషభం –వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. సన్నిహితులు సాయం అందిస్తారు. బంధువుల నుండి ధన, వస్తు లాభాలు పొందుతారు. సంతానమునకు నూతన అవకాశాలు.

మిథునం –పనులు పూర్తి చేస్తారు. సోదరుల నుండి శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

కర్కాటకం –భాగస్వామి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు..

సింహం –ఊహించని అవకాశాలు లాభిస్తాయి. మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కారమవుతాయి. పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా వుండును.

కన్య –బంధవులుతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆకస్మిక ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి.

తుల –భూవివాదాలు పరిష్కారమై ఊరట చెందుతారు. బంధువుల నుండి ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. విలువైన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ధనలాభం.

వ్యశ్చికం –సంఘంలో గౌరవం పొందుతారు. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. దూరప్రాంతాల నుండి కీలక సమాచారంఅందుతుంది.

ధనుస్సు –వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా వుండండి. ఆకస్మిక ధన, వస్తు లాభాలు పొందుతారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం.

మకరం –ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వున్నా అవసరాలకు డబ్బు అందుతుంది. అనుకోని అతిథుల నుండి విలువైన సమాచారం అందుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు.

కుంభం –నూతన మిత్రుల పరిచయాలు. దూరప్రాంతాల నుండి శుభవార్తలు వింటారు. విందు, వినోదాలు ఆర్థిక లావాదేవీలు మెరుగుపడతాయి. గృహ, వాహనయోగాలు.

మీనం –ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు. ముఖ్యమైన పనులలో నిదానం అవసరం. ఆర్థిక ఒడిదుడుకుల నుండి బయటపడతారు. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు.

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News