మేషం – ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. మీకు రావాల్సిన సొమ్ము చాలా వరకు చేతికంది వస్తుంది. చెల్లింపులను కూడా మీరు సకాలంలో చెల్లిస్తారు.
వృషభం – ఆర్థిక లావాదేవీలు కొంతవరకు అనుకూలంగా ఉంటాయి. మాట మీద నిలబడే వ్యక్తిగా పేరును సంపాదిస్తారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.
మిథునం – దీర్ఘకాలికంగా ఉన్న బాధలు తీరి ఊరట చెందుతారు. క్రమబద్ధమైనటువంటి ప్రణాళికలను రూపొందించుకొని తధానుగుణంగా అడుగులను ముందుకు వేస్తారు.
కర్కాటకం – వాయిదా పడుతున్న కోర్టు వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి. ముఖ్యమైన శుభప్రదమైన కార్యక్రమాలు ప్రయాస మీద నెరవేరుతాయి. సాధారణమైన ఫలితాలు ఉంటాయి.
సింహం – సహనానికి పరీక్షలు ఎదురవుతాయి. ఆర్థిక స్థితిగతులలో చెప్పుకోదగిన ఇబ్బందులు ఏర్పడవు. ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి.
కన్య – ప్రజా సంబంధాలను మరింతగా వృద్ధి చేసుకోవడానికి గాను నూతన ప్రక్రియను అవలంబిస్తారు. బ్యాంక్ అకౌంట్లను ప్రారంభిస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.
తుల – రుణాలు తీరుస్తారు. సహోదర సహోదరి వర్గంతో విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. జీవిత భాగస్వామి సలహాలను సూచనలను ఎక్కువగా పాటిస్తారు.
వృశ్చికం – ఆదాయాన్ని పెంపొందించుకునే అన్ని మార్గాలను సమర్ధవంతంగా చేజిక్కించుకోగలుగుతారు. కారణం లేని చికాకులు వేధిస్తాయి. మానసిక ఉల్లాసానికి ఆధ్యాత్మిక పట్ల మక్కువ చూపుతారు.
ధనున్సు – అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలకు గాను పరిష్కార మార్గాలు వెతుకుతారు. పనులలో ఆటంకాలు ఎదురయి చికాకులు పెడతాయి. ఆరోగ్యపరంగా నలతగా ఉంటుంది.
మకరం – సెల్ఫ్ డ్రైవింగ్ పట్ల అప్రమత్తతో వ్యవహరించండి. వృత్తి- ఉద్యోగాల పరంగా సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. జీవిత భాగస్వామి నుండి ధన లాభం పొందుతారు.
కుంభం – శ్రమ అధికంగా ఉంటుంది.ఫలితాలు అందుకు తగిన విధంగా ఉండవు. అయినప్పటికీ ఉత్సాహవంతంగా కార్యక్రమాలను సానుకూల పరుచుకోవడానికి ఓర్పును కనబరుస్తారు.
మీనం – ప్రతి విషయంలోనూ అన్ని విధాల జాగ్రత్తలు పాటించండి. గృహ నిర్మాణ ఆలోచనలలో తొందరపాటు వద్దు, ప్రముఖుల నుండి శుభ ఆహ్వానాలు అందుకుంటారు.
సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్
9014126121, 8466932225