Sunday, January 19, 2025

ఆదివారం రాశి ఫలాలు (05-11-2023)

- Advertisement -
- Advertisement -

మేషం – రక్త సంబంధీకులు దాయాదుల వలన సహాయం లభిస్తుంది. కార్యాలయంలో అధికారుల మందలింపులు తప్పకపోవచ్చు. స్పెక్యులేషన్ లభిస్తుంది. గతంలో మీరిచ్చిన ఋణాలు వసూలు అవుతాయి.

వృషభం – స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలలో అనుకూలమైన వార్తలు వింటారు. పెట్టుబడులు వాయిదా వేయడం మంచిది. మీరు చెప్పిన పనికి ఎదుటి వారి నుండి ప్రతిస్సందన బాగుంటుంది.

మిథునం – ప్రకటనలు, మీడియాకు సంభంధించిన అంశాలు అనుకూలంగా ఉంటాయి. ఇరుగు పొరుగు వారితో వివాదాలు తప్పకపోవచ్చు. నిదానమే ప్రధానమన్న సూక్తిని గుర్తుంచుకోండి.

కర్కాటకం – దూరప్రాంత విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వాక్చాతుర్యంతో ఎన్నో పనులను సానుకూల పరచుకుంటారు. మంచిరోజులు వచ్చినట్లుగా తోస్తుంది. స్వల్ప ధనలాభ నూచన.

సింహం – శారీరక రుగ్మత మానసిక కష్టానికి కారణం అవుతుంది. అకారణ కలహాలను ఆదిలోనే తుంచి వేయండి. మీ శక్తికి మించి ఒకానొక వ్యక్తిని ఆదుకుంటారు. ఊరట చెందుతారు.

కన్య – ఉచిత సలహాలు ఇచ్చేవారు తారసపడతారు. స్థాయి తక్కువ వ్యక్తులతోటి పోరాడవలసి వస్తుంది. జీవితభాగస్వామి సహాయ సహకారాలను సంపూర్ణంగా అందుకుంటారు.

తుల – పట్టుదలతో శ్రమిస్తారు. అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ఎంతో ఓర్పును కనబరుస్తారు. స్థిరాన్తుల వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

వృశ్చికం – చేసిన చిన్న సహాయాన్ని భూతద్దంలో చూపించే సన్నిహితులు అధికమవుతారు. సాంకేతిక విద్యను ఆధారంగా చేసే ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. పొదుపు పాటిస్తారు.

ధనుస్సు – జీవితభాగస్వామితో స్వల్ప విభేదాలు సూచిస్తున్నాయి. ఆర్థిక పురోగతి సాధించడానికి చేసే శ్రమ ఫలిస్తుంది. నిష్కారణమైన విమర్శలు, అపవాదులు తప్పక పోవచ్చు.

మకరం – ధనం ఖర్చ చేసే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉన్నట్లు తోన్తుంది. ప్రయాణాలు లాభిస్తాయి. నిష్కారణ భయం వేధిస్తుంది.

కుంభం – ఎంతోకాలంగా మీలో ఉన్న ఒక కోరిక ఈ రోజు నెరవేరుతుంది. చెల్లించవలసిన డబ్బుకై వత్తిడి అధికమవుతుంది. మధ్యవర్తిగా ఉండి మాట్లాడేదనికన్నా మాట్లాడక పోవటం చెప్టదగిన నూచన.

మీనం – జమా ఖర్చులు పరిశీలించుకుంటారు. తల్లి తరపు బంధువులకు సహాయాన్ని అందిస్తారు. కార్యాలయంలో ఉన్నతాధికారుల మెప్పు పొందుతారు. వాహన సౌఖ్యం పొందుతారు.

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News