మేషం – కోర్టు వ్యవహారాలు సానుకూల పడతాయి. రాజకీయ పరిచయాలు లాభిస్తాయి. కష్టమైన కార్యక్రమాలను కూడా శ్రమించే సానుకూల పరుచుకోగలుగుతారు.
వ్యషభం – ఉపయుక్తమని భావించిన ప్రతి వ్యవహారాలలోనూ ఓర్పు నేర్పులను కనబరుస్తారు. సువర్ణ ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఆర్థిక పురోభివృద్ధిని సాధించగలుగుతారు.
మిథునం – వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయి పెంపొందుతుంది. అన్ని పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా జరుగుతాయి. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అవసరం.
కర్కాటకం – ఇతరుల విషయాలలో జోక్యం తగదు.వివాదాస్పద విషయాలకు దూరంగా ఉంటారు. వ్యక్తిగత విషయాలలో ఇతరుల జోక్యానికి అడ్డుకట్ట వేస్తారు. బహుముఖంగా ప్రజ్ఞా పాటవాలు కనబరుస్తారు.
సింహం – నిర్మోహమాట వైఖరి కనబరుస్తారు. మీ మానసిక పరిస్థితిని అర్థం చేసుకోగలిగిన వారు నిజంగా ఎవరని తెలుసుకోగలుగుతారు.దీర్ఘకాలిక రుణాలను గడువుకు ముందే తీర్చి వేస్తారు.
కన్య – భాగస్వామ్య వ్యాపారాలు విస్తరిస్తారు. ఓ ముఖ్యమైన పని కార్యాలయంలో పరిష్కారం అవుతుంది. కీలక స్థానంలో ఉన్న ఓ అధికారి ద్వారా దాన్ని సాధిస్తారు.
తుల – మీ ఆలోచనలు కార్యరూపాన్ని సంతరించుకుంటాయి. మీడియా వలన లాభపడతారు. ప్రతి విషయంలోనూ చాకచక్యంగా వ్యవహరిస్తారు. అందుకు తగిన విధంగా కృషిని కూడా సాధించగలుగుతారు.
వ్యశ్చికం – చెవి ముక్కు గొంతు సంబంధిత ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన విషయాలలో మెలకువలు అవసరం.
ధనుస్సు – ఆర్థిక స్థితిగతుల పైన ప్రధానంగా దృష్టిని సారిస్తారు. ఆహార ఆరోగ్య సూత్రాలను తూ.చా తప్పకుండా పాటించడం మంచిది. కోపతాపాలకు వివాదాలకు దూరంగా ఉండండి.
మకరం – రుణాలను చాలా వరకు తీరుస్తారు. పనులు నిదానంగా సాగినప్పటికీ ప్రయోజనాలకు ముప్పు వాటిల్లదు. అనవసరమైన విషయాలలో కాలయాపన చేస్తున్న ఆత్మీయులను గాడిలో పెడతారు.
కుంభం – మధ్యవర్తిత్వం వహించి ఒకానొక కార్యక్రమాన్ని సానుకూల పరుస్తారు. విందు వినోద కార్యక్రమాలలో నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక లావాదేవీలలో కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు.
మీనం – మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి గాను అవకాశాలు కలిసి వస్తాయి. విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. వీసా పాస్పోర్ట్ వంటి అంశాలు కలిసి వస్తాయి.