మేషం :- పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆర్థికపరిస్థితి అంతంత మాత్రంగా వున్న అవసరాలకు డబ్బు అందుతుంది. జీవిత భాగస్వామి నుండి ధనలాభం పొందుతారు. ఆరోగ్య సమస్కలు ఎదురైన అధిగమిస్తారు.
వృషభం:- మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. దూరప్రాంతాల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు పొందుతారు. నూతన వస్తులాభం
మిథునం:- ఇంటా బయటా అనుకూలంగా ఉంటుంది. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలలో ఎదురైన చిక్కులు తొలగుతాయి. పై అధికారులతో జాగ్రతగా ఉండడం మంచిది.
కర్కాటకం :- పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. శ్రమకు తగిన ఫలితం దక్కడం కష్టమే. ప్రయాణాల్లో ఆటంకాలు ఎదురైన అధిగమించి ముందుకు సాగుతారు.
సింహం:- ముఖ్యమైన నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. విందు వినోదాలలో ఆప్తులతో పాల్గొంటారు. సన్నిహితుల నుండి ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. ఉద్యోగాలలో ఎదురైన ఒత్తిళ్ళు తగ్గుతాయి.
కన్య :- నూతన పరిచయాలు పెరుగుతాయి. సంతానంకు కార్యసిద్ధి. ఆప్తులను కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి-వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు. అధికారుల నుండి ఉద్యోగస్తులకి తీపికబురు అందుతుంది.
తుల:- వృత్తి-వ్యాపారాలలో ఎదురైన చికాకులు, అడ్డంకులు తొలుగుతాయి. తలపెట్టిన పనులు నిదానంగా సాగుతాయి. బంధువుల నుండి శుభవార్తలు వింటారు. కుటుంబ నభ్యులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు.
వృశ్చికం :- జీవిత భాగస్వామి నుండి ఆర్ధిక లాభం పొందుతారు. వృత్తి-వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. నూతన మిత్రులు పరిచయమై సాయం అందిస్తారు. కాంట్రాక్టులు పొందుతారు. వాహన యోగం.
ధనుస్సు:- ముఖ్యమైన వ్యవహారాలలో అవరోధాలు ఏర్పడిన అధిగమించి ముందుకు సాగుతారు. వివాదాలకు దూరంగా ఉండండి. సన్నిహితుల నుండి విలువైన నమాచారం అందుకొంటారు. స్వల్ప ధనలాభం. బంధువుల నుండి కొన్ని విషయాలలో అధిక ఒత్తిడి.
మకరం:- మిత్రుల నుండి శుభవార్తలు అందుకొంటారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి-వ్యాపారాలలో లాభాలు పొందుతారు. భూముల క్రయ విక్రయాలలో లాభాల పంట. నూతన వాహన యోగం ఉన్నది.
కుంభం :- పనులు చకచక సాగుతాయి. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. మీ శ్రమకు తగిన ఫలితం కనబడుతుంది. వృత్తి-వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు లభిస్తాయి.
మీనం :- ఆకస్మిక ప్రయాణాలలో తొందరపాటు నిర్ణయాలు వద్దు. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం తగదు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. సంతానం నుండి ధన, వస్తు లాభాలు పొందుతారు. వాహనాలు నడిపే విషయంలో నిర్లక్ష్యం వద్దు.
సోమేశ్వరశర్మ : 8466932223,9014126121