Thursday, December 19, 2024

బుధవారం రాశి ఫలాలు(07-02-2024)

- Advertisement -
- Advertisement -

మేషం: గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సంఘంలో గౌరవం లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం పొందుతారు. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. పెట్టుబడులలో ప్రోత్సాహం లభిస్తుంది.

వృషభం: మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకొంటారు.ఆర్థిక ఒడిదుడుకుల నుండి బయటపడతారు. ఉద్యోగాలలో స్థానచలనాలు.అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని ఉపయోగించుకొండి.

మిథునం: ఆకస్మిక ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా వుండండి. రుణాలు తీరుతాయి. చర్చాగోష్టులలో చురుకుగా పాల్గొంటారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు.

కర్కాటకం: నూతన వ్యాపారాలు ప్రోత్సాహకంగా వుంటాయి. విందు, వినోదాలు. పనులు సకాలంలో పూర్తి. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. అనుకోని అతిథులను కలిసి ఆనందంగా గడుపుతారు. కాంట్రాక్టులు దక్కుతాయి.

సింహం: కుటుంబ సమస్యలు తీరి ప్రశాంతత పొందుతారు. కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. మిత్రుల నుండి కీలక సమాచారం అందుకొంటారు. విద్యా, ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి.

కన్య: బంధువులతో ఏర్పడిన విరోధాలు పరిష్కారించుకొంటారు. ఆరోగ్య సమస్యలు ఎదురైన అధిగమిస్తారు. దీర్ఘకాలిక రుణాల నుండి బయటపడతారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా వుండును.

తుల: ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వున్న అవసరాలకు డబ్బు అందుతుంది. బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఉద్యోగాలలో హోదాలు పొందుతారు. సంతానంనకు విద్యావకాశాలు పొందుతారు.

వృశ్చికం: ప్రముఖుల కలయిక. రాజకీయ కళారంగాల వారికి సన్మాన యోగాలు. ఆస్తి వివాదాలు పరిష్కారమై లబ్ది పొందుతారు. దూరప్రాంతాల నుండి శుభవార్తలు. వివాహ యత్నాలు అనుకూలిస్తాయి.

ధనస్సు: వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. బంధువుల నుండి వచ్చిన వత్తిడులు తీరుతాయి. ఉద్యోగాలలో స్థానచలనం. సేవరంగాలలో పాల్గొంటారు.

మకరం: కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వుంటుంది. నూతన వస్తు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభిస్తాయి. తండ్రి నుండి ఆస్తి లాభం పొందుతారు.ఆరోగ్య పరంగా స్వల్ప ఇబ్బందులు ఏర్పడవచ్చు .

కుంభం: ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి. వివాదాలకు దూరంగా వుండండి. ఆరోగ్యం, వాహనం పట్ల మెలుకువ అవసరం. ప్రయాణాలు లాభిస్తాయి. క్రయ, విక్రయాలలో లాభాలు పొందుతారు. వస్తు లాభం.

మీనం: కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు.ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణ. పెట్టుబడులకు తగిన సమయం. అరుదైన ఆహ్వానాలు. ప్రయాణాలలో జాగ్రత్తలు అవసరం.

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News