Sunday, January 19, 2025

శుక్రవారం రాశి ఫలాలు(07-06-2024)

- Advertisement -
- Advertisement -

మేషం – కుటుంబ పురోభివృద్ధి, వ్యక్తిగత పురోభివృద్ధి బాగుంటుంది. సంతృప్తికరమైన ఫలితాలను సాధించగలుగుతారు. అధిక శ్రమ తప్పకపోవచ్చు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి.

వృషభం – ఉపకరించే విషయాలను సకాలంలో తెలుసుకొని లాభపడతారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. విందు వినోద కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు.

మిథునం –  ఆర్థికంగా చెప్పుకోదగిన ఇబ్బందులు ఏమీ ఏర్పడవు. నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తారు. నూతన వస్తూ వస్త్రాలను కొనుగోలు చేస్తారు.

కర్కాటకం – ఆరోగ్యం కొంత నలతగా ఉంటుంది. విస్తృతంగా చర్చలను సాగిస్తారు. కొత్త కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు.కొత్తవారికి స్నేహ బృందంలో చోటు కల్పిస్తారు.

సింహం – వ్యాపారంలో తాత్కాలిక భాగస్వాములను చేర్చుకుంటారు.ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. సంగీత సాహిత్యల పట్ల విశేషంగా అభిరుచిని కనబరుస్తారు. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.

 కన్య – ముఖ్యమైన వ్యవహారాలలో నిదానంగా నింపాదిగా వ్యవహరిస్తే లాభపడగలుగుతారు. ఆర్థిక పరమైన సర్దుబాట్లు చేసుకోవడం కష్టతరంగా పరిణమిస్తుంది.ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి.

తుల – ముడి పడని వ్యవహారాలలో స్పష్టత ఏర్పడుతుంది.దూరప్రాంత ప్రయాణాలు తత్ సంబంధిత వ్యవహారాలు సానుకూల పడతాయి.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

వృశ్చికం – సంతాన యోగక్షేమాలపైన ప్రధానంగా దృష్టిని కేంద్రీకరిస్తారు.సభలు సమావేశాలకు గాను ఆహ్వానాలు అందుకుంటారు.ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

ధనుస్సు – ప్రభుత్వ ప్రైవేటు సంబంధిత పెండింగ్ బిల్స్ మంజూరు అవుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి.

మకరం – శుభకార్యాలు అనుకున్న విధంగా పూర్తి చేయడానికి సన్నిహితులు సహాయం అందిస్తారు. నూతన గృహం లేక వాహనం కొనుగోలు సానుకూలపడుతుంది.

కుంభం – ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది. వృత్తి- వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. నూతన బాధ్యతలు ప్రజా సంబంధాలను వృద్ధిపరుచుకొనుట కష్టసాధ్యం ఉంటుంది.

మీనం – మీ స్థాయికి తగని వ్యక్తులతో పోరాటములు, రాని బాకీలు, స్థిరాస్తుల వ్యవహారములు అమ్మకములు కొంత ప్రతికూల వాతావరణంలోనే ఉంటాయి. కోపతాపాలకు వివాదాలకు దూరంగా ఉండండి.

Saturday rasi phalalu

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News