Tuesday, September 17, 2024

శనివారం రాశి ఫలాలు (07-10-2023)

- Advertisement -
- Advertisement -

మేషం:- ఉద్యోగస్తులకి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇంటా బయటా ప్రోత్సాహం లభిస్తుంది. ఆకస్మిక ప్రయాణాలలో అనుకోని పాత మిత్రుల కలయిక. వృత్తి, వ్యాపారాలలో ఏర్పడిన చికాకులు తొలుగుతాయి. పనులు జెట్ స్పీడ్ గా సాగుతాయి.

వృషభం:- కాంట్రాక్టులు లాభిస్తాయి. అనుకోని అవకాశాలు పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఆర్ధికాభివృద్ధి కంటికి కనిపిస్తుంది.

మిథునం :- కుటుంబ సమస్యలు ఎదురైన అధిగమిస్తారు. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. మిత్రులతో ఏర్పడిన ఆర్ధిక లావాదేవీల విభేదాలు ఒక కొలిక్కి వస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు.

కర్కాటకం:– కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు పొందుతారు. సంతానం నుండి కీలక సమాచారం అందుకొంటారు. నూతన వన్తు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు.

సింహం :- వ్యవహారాలలో ఆటంకాలు ఎదురై చికాకు పెడతాయి. ఆరోగ్య సమస్యల నుండి కొంత వరకు బయటపడతారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప  లాభాలు పొందుతారు.

కన్య:- దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుకొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుకొంటారు. జీవితభాగస్వామి నుండి ఆస్తిలాభం పొందుతారు. విద్యావకాశాలు వివరాలు తెలుసుకుంటారు.

తుల:- దూరప్రాంతాల నుండి వచ్చిన వార్త కొంత ఆనందం కలిగిస్తుంది. ఉహించినంత ధనలాభం. సంతానంనకు నూతన ఉద్యోగ అవకాశాలు అందుకుంటారు. పనులు సజావుగా సాగుతాయి. వ్యత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు.

వృశ్చికం :- బంధువులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకొంటారు. గృహనిర్మాణ ఆలోచనలు నిదానంగా సాగుతాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుకొంటారు. వాహనయోగం కలుగుతుంది.

ధనుస్సు:- విద్యార్థులకు శ్రమ అధికం. వృత్తి, వ్యాపారాలలో ఎదురైన చికాకులు తొలుగుతాయి. ఉద్యోగాలలో స్వల్ప మార్పులు వుంటాయి. ప్రయాణాలలో తొందర పాటు నిర్ణయాలు వద్దు.

మకరం:- కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. వృత్తి-వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు నూతన హోదాలు లభిస్తాయి. వాహన యోగం గోచరిస్తున్నది.

కుంభం :- నూతన పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. తండ్రి ద్వారా ఆస్తి లాభం పొందుతారు. ఉద్యోగులకు, కార్మికులకు ఉన్నత హోదాలు, అరుదైన ఆహ్వానాలు లభిస్తాయి.

మీనం:- ఆర్థిక ఇబ్బందులు ఎదురైన అధిగమిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. బంధువులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకొంటారు. ఆరోగ్యం పట్ల మెలుకువలు అవసరం.

సోమేశ్వరశర్మ : 8466932223,9014126121

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News