Thursday, December 19, 2024

నేటి రాశి ఫలాలు.. ఫలితాలు…(08/09/2023)

- Advertisement -
- Advertisement -

మేషం:నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు.రెండు మూడు విధాలుగా ధన లాభాలు ఉంటాయి.వివాదాలకు ఎల్లప్పుడు దూరంగా ఉండటం శ్రేయస్కరం. ఆప్తులతో చిన్ననాటి స్నేహితులను కలిసి ఆనందంగా గడుపుతారు.

వృషభం:వృత్తివ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాలలో జాప్యం జరిగిన నిదానంగా పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామి నుండి ధన లాభాలు పొందుతారు. కొన్నివిషయాలలోఆచితూచి అడుగులు వేయండి.

మిథునం:నూతన ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. సోదరులతో ఏర్పడిన ఆర్థికలావాదేవీల వివాదాలు పరిష్కారమై ఊరట చెందుతారు.ఉద్యోగాలలో స్వల్ప మార్పులు ఉంటాయి. దూర ప్రయాణాలు లాభిస్తాయి.వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

కర్కాటకం:చిన్ననాటి మిత్రులను కలిసి కష్ట సుఖాలను పంచుకుంటారు. సంఘంలో ఆదరణ పెరుగుతుంది. ఆప్తుల నుండి శుభవార్తలు ఆహ్వానాలు అందుకుంటారు. జీవిత భాగస్వామి తరఫున ఆర్థిక లాభాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో సఖ్యత అవసరం.

సింహం:కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలే శ్రేయస్కరం అదే మీకు మేలు చేస్తుంది.జీవిత భాగస్వామి సహాయ సహకారాలతో నూతన పనులను ప్రారంభిస్తారు. వాహన సౌఖ్యం పొందుతారు. ధన వస్తు లాభాలు పొందుతారు. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం.

కన్య:మిత్రులతో బందువర్గంతో ఉన్న వివాదాలు పరిష్కరించుకుంటారు.ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంటుంది. భూ సంబంధిత వ్యవహారాలు ఒకకొలిక్కి వస్తాయి.చేపట్టిన విషయ వ్యవహారాలు నిదానంగా విజయవంతంగా పూర్తి చేస్తారు.

తుల:శ్రమకు తగిన ప్రతి ఫలం దక్కదు. చేపట్టిన పనులలో జాప్యం జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో బాధ్యతలు పెరిగిన సమర్థవంతం గానిర్వహిస్తారు.వ్యాపార పరంగా అంతా అనుకూల ఫలితాలు గోచరించడం లేదు.

వృశ్చికం:నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అనవసర విషయాలకు వివాదాలకు ఎల్లప్పుడూ దూరంగా ఉండటం మంచిది. అని చెప్పదగిన సూచన.విందు వినోదాలలో శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అవసరం.

ధనస్సు:కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. ఆరోగ్యం పట్ల మెలకువ చాలా అవసరం. ఉద్యోగ ప్రయత్నాలలో సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. దూర ప్రాంతాల నుండి ఆస్తి తాలూకు కీలక సమాచారం అందుకుంటారు.

మకరం:వృత్తి-వ్యాపారాలు లాభ సాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు, ఇంక్రిమెంట్లు పొందుతారు. ముఖ్యమైన నిర్ణయాలలో సొంత ఆలోచనలే శ్రేయస్కరం. కుటుంబంలో ఉన్న కలహాలకు ముగింపు లభిస్తుంది.ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి.

కుంభం:చేపట్టిన నూతన పనులు మందకోడిగా సాగుతాయి/దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన సమాచారం సంతృప్తిని కలుగజేస్తుంది.శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుతుంది.నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి.

మీనం:వృత్తి-వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. సంతానం నూతన విద్యా, ఉద్యోగ అవకాశాలు పొందుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం పొందుతారు. పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News