Sunday, November 17, 2024

ఆదివారం రాశి ఫలాలు(08-10-2023)

- Advertisement -
- Advertisement -

మేషం:- ఎంత శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆకస్మిక ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు. తగాదాలకు దూరంగా ఉండండి.

వృషభం :- వృత్తి-వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.  పని భారం పెరుగుతుంది.  ప్రయాణాలలో తొందరపాటు నిర్ణయాలు వద్దు. కుటుంబంలో ఏర్పడిన చికాకులు తొలగించుకొంటారు. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది.

మిథునం :- కొత్త వ్యక్తులు పరిచయమై సాయం అందిస్తారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆప్తులను కలిసి ఆనందంగా గడుపుతారు. భాగస్వామ్య వ్యాపారాలలో లాభాలు పొందుతారు. ప్రముఖుల పరిచయాలు అవుతాయి.

కర్కాటకం :- గృహనిర్మాణ ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఏర్పడిన తగాదాలు పరిష్కారదిశగా సాగుతాయి. ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. ధనలాభం.

సింహం:- పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఆప్తుల సలహాలతో సఫలమవుతాయి. విందు వినోదాలు. వస్తు, వస్త్ర  లాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు.

కన్య:- ముఖ్యమైన వ్యవహారాలలో ఏర్పడిన అవరోధాలు కొంత వరకు తొలుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబ సభ్యులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్య పరంగా కొన్ని స్వల్ప ఇబ్బందులు గోచరిస్తున్నాయి

తుల :-  ఋణ భారాలు తొలగుతాయి. మానసిక ప్రశాంతత పొందుతారు. సంతానంకి సంబంధించిన  విద్యా, ఉద్యోగ విషయాలు చర్చించుకుంటారు. సభలు, సమావేశాల్లో చురుకుగా పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలం.

వృశ్చికం :- కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వుంటుంది. విలువైన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.  పెండింగ్ లో  ఉన్న వ్యవహారాలలో విజయం సాధిస్తారు.  వ్యత్తి-వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. వాహన ప్రయాణాలలో జాగ్రత్తలు అవసరం.

ధనుస్సు :- ఋణ బాధలు  కొంత వరకు తీరుతాయి. ఆకస్మిక ప్రయాణాలలో నూతన మిత్రులు పరిచయాలు. ఇంటా బయట ఒకే రకమైన ధోరణి ఉంటుంది. సోదరుల నుండి ధనలాభం.

మకరం :- బంధువుల నుండి ఒత్తిడులు ఎదురైన అధిగమిస్తారు. ఇతరుల విషయాలలో జోక్యం తగదు. పనులు నిదానంగా సాగుతాయి. ఉద్యోగస్తులు స్వల్ప లాభాలు పొందుతారు. వస్తు లాభాలు ఉంటాయి. ఆర్ధిక పరంగా ఖర్చులు అధికం.

కుంభం :- కార్య జయం కలుగుతుంది. ఆప్తులను కలిసి ఆనందంగా గడుపుతారు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల నుండి కీలక సమాచారం అందుతుంది. భూమిని కొనుగోలు చేసే విషయమై ఒక ఆలోచనకి వస్తారు.

మీనం :- వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. పాత, కొత్త  మిత్రుల నుండి ఆహ్వానాలు అందుతాయి. జీవిత భాగస్వామి నుండి సహాయ సహకారాలు  పొందుతారు. సంఘంలో  మీదే పై చేయిగా ఉంటుంది.

సోమేశ్వరశర్మ : 8466932223,9014126121

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News