Sunday, December 22, 2024

బుధవారం రాశి ఫలాలు (08-11-2023)

- Advertisement -
- Advertisement -

మేషం: రుణాలు కొంతవరకు తీరుతాయి.పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. సంతానం విద్యా, ఉద్యోగ అవకాశాలు పొందుతారు. ఇంటాబయట మీదే పై చేయిగా ఉంటుంది. మీ పరపతి పదింతలు అవుతుంది ఆనందంలో తేలుతారు

వృషభం: నూతన పరిచయాలు పెరుగుతాయి. మీరు మొదలు చేసినా నూతన కార్యక్రమాలు విజయ వంతంగా ముందుకు సాగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సంతానం తలపెట్టిన పనులలో విజయం సాధిస్తారు.

మిథునం:  స్వల్పంగా ధన లాభం ఉంటుంది. సాధ్యమైనంతవరకు వివాదాలకు, అనాలోచిత విషయాలకు దూరంగా ఉండటం మంచిది. ముఖ్యమైన పనులలో ఒడిదుడుకులు. వచ్చిన కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో నిదానంగా పూర్తి చేస్తారు.

కర్కాటకం: ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలకు కుదురుతాయి, గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. మానసిక ఉల్లాసంతో పనులు త్వరగతిన పూర్తి చేస్తారు.  సన్నిహితులతో కలిసి ఆనందంగా గడుపుతారు.ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం.

సింహం: జీవిత భాగస్వామి నుండి ఆర్థికపరంగా అభివృద్ధి పొందుతారు. గతంలో మీరు తలపెట్టిన పెట్టుబడులకు అనుకున్న లాభాలు అందుకుంటారు. వాహన సౌఖ్యం.  నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహ అలంకార సామాగ్రి వస్తు లాభాలు పొందుతారు.

కన్య: సహోదర వర్గంతో ఆర్థికపరమైన లావాదేవీల విషయంపై వివాదాలు ఏర్పడతాయి.  మీరు చేసే పనులలో తప్పులు జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు. మీ శ్రమకు మిశ్రమ ఫలితాలు పొందుతారు. దూరప్రాంతాల నుండి ఆకస్మిక శుభ ఆహ్వానాలు అందుకుంటారు.

తుల: ఆర్థిక ఇబ్బందులు చికాకు పెడతాయి. మనం ఒకటి తలిస్తే పైవాడు ఒకటి తలుస్తాడు అనే విధంగా ఉంటుంది. కానీ చేసే పనులు నిబద్ధతతో చేస్తే విజయం అందుకునే అవకాశాలు ఉన్నాయి.వృత్తి వ్యాపారాల పరంగా స్వల్ప లాభాలు పొందుతారు.

వృశ్చికం: నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. ఇంటిలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. ఆడంబరాలకు ధనం అధికంగా ఖర్చవుతుంది. ఏ నిర్ణయం చేసిన వెనుక ముందు ఆలోచించి చేయండి. లేదంటే మొదటికే మోసం అవుతుంది.

ధనస్సు: పెట్టుబడులకు తగిన ఫలితాలు పొందుతారు.ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రుణాలు కొంతవరకు తీరుస్తారు ప్రశాంత వాతావరణ నెలకొంటుంది. అనుకొని విధంగా కాంట్రాక్టులు దక్కుతాయి.వాటిని నిలుపుకోవడానికి శతవిధాలుగా శ్రమిస్తారు సాధిస్తారు.

మకరం: ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది.మానసిక ధైర్యం విడవద్దు. చేపట్టిన పనులు  మందకొడిగా సాగుతాయి. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.ఆకస్మిక ధన లాభం పొందుతారు.

కుంభం: కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో మీరు తలపెట్టిన పనులు వేగంగా సాగుతాయి.స్థిర చరాస్తులు కొనుగోలు చేస్తారు.దూర ప్రయాణాలు లాభిస్తాయి. ఆరోగ్యం పట్ల మెలకువ చాలా అవసరం.రాజకీయ రంగాల వారు శుభవార్తలు వింటారు.

మీనం: రాజకీయ, కళారంగం, పారిశ్రామిక రంగాల వారికి ప్రభుత్వ రంగాల నుండి ఆహ్వానం అందుతాయి.వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.దూరప్రాంతాల సందర్శనం ఆనందాన్ని కలిగిస్తాయి.నూతన వస్తు,వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News