మేషం – సంఘంలో గౌరవం పొందుతారు. దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. మానసిక ప్రశాంతత పొందుతారు. ఆరోగ్యం పట్ల మెలుకువ అవసరం. భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.
వృషభం – ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. నూతన మిత్రులు పరిచయమై కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. దూరప్రాంతాల నుండి శుభవార్తలు అందుకొంటారు. నూతన ఉద్యోగావకాశాలు.
మిథునం – ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా వున్న అవసరాలకు డబ్బు అందుతుంది. రుణ వత్తిడుల నుండి బయటపడతారు. కొత్త కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. సంతానం నకు విద్యా, ఉద్యోగావకాశాలు పొందుతారు.
కర్కాటకం – ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. విద్యా ఉద్యోగావకాశాలు పొందుతారు. ఆరోగ్యం, వాహనాల విషయాలలో జాగ్రత్త అవసరం.
సింహం – అనుకోని సమస్యలు వేధిస్తాయి. కుటుంబ సభ్యుల నుండి సహాయం అందుతుంది. కోపతాపాలకు దూరంగా వుండండి. ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది.ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి.
కన్య – నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకొంటారు. గృహనిర్మాణ ఆలోచనలలో తొందరపాటు వద్దు. వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. రుణాలు కొంతవరకు తీరుతాయి.
తుల – కీలక నిర్ణయాలలో తొందరపాటు వద్దు. ముఖ్యమైన పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. అరుదైన ఆహ్వానాలు. అనుకోని అవకాశాలు ఆశ్చర్యపరుస్తాయి.
వృశ్చికం – భూవివాదాలు తీరి లబ్ధి పొందుతారు. సోదరుల నుండి శుభవార్తలు అందుకొంటారు. సంఘంలో గౌరవం పొందుతారు. కళారంగాల వారికి సన్మానాలు, సత్కారాలు పొందుతారు. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు.
ధనుస్సు – వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పాత బాకీలు వసూలవుతాయి. విలువైన వస్తు సామాగ్రి కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి.
మకరం – మిత్రుల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆస్చర్యపరుస్తాయి. సంఘంలో గౌరవం పొందుతారు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. పెట్టుబడులకు అనుకూలంగా వుండును. సోదరుల నుండి ధన, వస్తు లాభాలు.
కుంభం – భాగస్వామ్య వ్యాపారాలలో ప్రోత్సాహం లభిస్తుంది. కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా వుండును.
మీనం – బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా వుండండి. ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది. మానసిక ప్రశాంతత పొందుతారు.
సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్
9014126121, 8466932225